
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున తెలంగాణ మంత్రులకు నిరసన సెగ ఎదురైంది. వరంగల్‌లో ఓ కార్యక్రామానికి వెళ్తున్న మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్‌కు నిరసన సెగ తాకింది. మంత్రులను గిరిజన సంఘాల నేతలు అడ్డుకున్నారు. మెడికో ప్రీతికి న్యాయం చేయాలంటూ మంత్రులకు వినతి పత్రం ఇచ్చేందుకు హరిత హోటల్‌కు పెద్దఎత్తున గిరిజన సంఘ నేతలు వచ్చారు. ఈ క్రమంలోనే గిరిజన నాయకులపై మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also : ఫోన్ మాట్లాడుతూనే కుప్పకూలిన యువకుడు… అక్కడికక్కడే మృతి
ప్రీతి కేసును రాజకీయం చేయొద్దంటూ గిరిజన సంఘాల నేతలపై అసహనం వ్యక్తం చేశారు. దీంతో.. గిరిజన బిడ్డకు న్యాయం చేయని గిరిజన మంత్రి మాకెందుకంటూ గిరిజన సంఘాల నేతలు ఆందోళనకు దిగారు. సత్యవతి రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు. మెడికో విద్యార్థిని ప్రీతి ఘటనలో సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ.. ఆందోళన చేశారు. మెడికో ప్రీతి కేసులో ఇప్పటికే పోలీసుల విచారణ కొనసాగుతోంది. అటు పోలీసులు, ఇటు యాంటీ ర్యాగింగ్ కమిటీ.. లోతుగా విచారణ చేస్తున్నారు.
Also Read : సీఎం కేసీఆర్ ఓఎస్డీగా దేశపతి శ్రీనివాస్ రాజీనామా…
ఈ కేసులో నిందితుడు సైఫ్‌ను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు.. అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. అంతే కాకుండా.. ప్రీతి తోటి జూనియర్ డాక్టర్లను కూడా పోలీసులు విచారిస్తున్నారు. సాంకేతిక ఆధారాలను సైతం సేకరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే.. ప్రీతికి సంబంధించిన టాక్సీకాలజీ రిపోర్టులో ప్రీతి శరీరంలో ఎలాంటి విషపదార్థాలు లేవని రావటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో.. ప్రీతి తల్లిదండ్రులు డీజీపీని కలిసి.. ప్రీతిది ఆత్మహత్య కాదు హత్య అని ఆరోపిస్తూ పలు అనుమానాలు వ్యక్తం చేశారు. వీటిన్నింటినీ పరిగణలోకి తీసుకుని పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
- ట్యాంక్‌బండ్ వద్ద వైఎస్ షర్మిల అరెస్ట్… బొల్లారం పోలీస్ స్టేషన్‌కు తరలింపు
- తెలంగాణలో “ఆరోగ్య మహిళ” క్లినిక్ లు… కరీంనగర్ లో ప్రారంబించిన మంత్రి హరీష్ రావు
- రోడ్డు ప్రమాదంలో పంచాయతీ కార్యదర్శి మృతి…
- తెలంగాణ గడ్డపై కాషాయం జెండా !… పక్కా వ్యూహాంతో ఎన్నికలకు కమలదళం
- ప్రగతిభవన్‌కు వెళ్లిన ఎమ్మెల్సీ కవిత… ఈడీ నోటీసులపై కేసీఆర్‌తో చర్చలు