
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : ముఖ్యమంత్రి కేసిఆర్ ఓఎస్డీగా కొనసాగుతోన్న దేశపతి శ్రీనివాస్ రాజీనామా తన పదవికి రాజీనామా చేశారు. అయితే.. ఈ రాజీనామాకు కారణం.. ఎమ్మెల్సీ ఎన్నికలే. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా.. దేశపతి శ్రీనివాస్ పేరును సీఎం కేసీఆర్ ప్రకటించారు. దీంతో.. తన పదవికి రాజీనామా చేయాలని దేశపతి నిర్ణయించుకున్నారు. కాగా.. దేశపతి శ్రీనివాస్.. మలిదశ తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారు. ఉద్యమ సమయంలో కేసీఆర్ వెన్నంటే ఉన్నారు. రాష్ట్రం సిద్ధించాక.. 2014 నుంచి సీఎం కేసీఆర్ వద్ద ఓఎస్డీగా వ్యవహరిస్తున్నారు దేశపతి.
Read Also : ట్యాంక్‌బండ్ వద్ద వైఎస్ షర్మిల అరెస్ట్… బొల్లారం పోలీస్ స్టేషన్‌కు తరలింపు
సిద్దిపేట జిల్లాకు చెందిన దేశపతి శ్రీనివాస్.. ఉపాధ్యాయుడిగా తన జీవితం ప్రారంభించారు. కాగా.. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. తన కలంతో, గళంతో.. ఉద్యమానికి తన వంతు కృషి చేశారు. ప్రత్యేక తెలంగాణ కోసం వాదించిన న్యాయవాదుల్లో ఒకరు దేశపతి శ్రీనివాస్. ప్రస్తుతం.. ఆయన తెలంగాణ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. తెలుగు భాష ప్రాముఖ్యతపై విశేష కృషి చేస్తున్నారు. పలు సినిమా పాటలకు కూడా దేశపతి సాహిత్యాన్ని అందించారు.
ఇవి కూడా చదవండి :
- తెలంగాణలో “ఆరోగ్య మహిళ” క్లినిక్ లు… కరీంనగర్ లో ప్రారంబించిన మంత్రి హరీష్ రావు
- రోడ్డు ప్రమాదంలో పంచాయతీ కార్యదర్శి మృతి…
- తెలంగాణ గడ్డపై కాషాయం జెండా !… పక్కా వ్యూహాంతో ఎన్నికలకు కమలదళం
- ప్రగతిభవన్‌కు వెళ్లిన ఎమ్మెల్సీ కవిత… ఈడీ నోటీసులపై కేసీఆర్‌తో చర్చలు
- ఒకే ముహూర్తంలో ఇద్దరిని పెళ్లి చేసుకోనున్న యువకుడు… భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వింత పెళ్లి