
క్రైమ్ మిర్రర్, మంగపేట : మండలంలోని బిక్షంపేట గ్రామ పంచాయతీ కార్యాలయంలో కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న బండ్ల గురుమూర్తి(35) గురువారం ఉదయం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని చింతకుంట గ్రామానికి చెందిన బండ్ల గురుమూర్తి మంగళవారం హోలీ సందర్బంగా సెలవు దినం కావడంతో తాడ్వాయి లోని కస్తూర్బా బాలికల ఆశ్రమ పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా విధులు నిర్వహిస్తున్న తన భార్య దగ్గరకు వెళ్ళాడు.
Also Read ; తెలంగాణ గడ్డపై కాషాయం జెండా !… పక్కా వ్యూహాంతో ఎన్నికలకు కమలదళం
తిరిగి బుధవారం విధులకు హాజరు కావడం కోసం తాడ్వాయి నుండి బిక్షంపేటకు వస్తున్న గురుమూర్తి చిన్న బోయినపల్లి తాడ్వాయి మార్గమధ్యంలో రోడ్డుపై నిలిచి ఉన్న లారీని గమనించక ఢీకొనడంతో తలకు తీవ్ర గాయం అయింది. గాయపడిన గురుమూర్తిని చికిత్స కోసం వరంగల్ లో హాస్పిటల్ కి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ గురుమూర్తి మరణించాడు. మృతి చెందిన గురుమూర్తికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
ఇవి కూడా చదవండి :
- ప్రగతిభవన్‌కు వెళ్లిన ఎమ్మెల్సీ కవిత… ఈడీ నోటీసులపై కేసీఆర్‌తో చర్చలు
- ఒకే ముహూర్తంలో ఇద్దరిని పెళ్లి చేసుకోనున్న యువకుడు… భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వింత పెళ్లి
- తెలంగాణలో పూటకో హత్య, గంటకో రేప్… రేపిస్టులంతా బీఆర్ఎస్‌లోనే… బండి సంజయ్
- ప్రజలనే కాకుండా దేవుళ్ళను మోసం చేస్తున్న కేసిఆర్ కుటుంబం… రేవంత్ రెడ్డి
- టిడిపి, జనసేన పొత్తులపై నారా లోకేష్ సంచలన వ్యాక్యలు…