
క్రైమ్ మిర్రర్, ప్రత్యేక ప్రతినిధి : తెలంగాణలో లిక్కర్ స్కామ్ లో కూడుకపోయిన టిఆర్ఎస్ పార్టీకి ప్రత్యమ్యాయంగా కాంగ్రెస్ పార్టీ పోటీ ఇవ్వనుందా… లిక్కర్స్ స్కామ్ లో అరెస్టు కాకుండా ముందే మధ్యంతర ఎన్నికలు సృష్టించి.. ప్రతిపక్ష పార్టీలకు అంతుచిక్కకుండా ఎన్నికలలో గెలిచి చరిత్ర రాయాలని ఆలోచన కేసీఆర్ కు తట్టిందేమో కానీ.. ఈడి ఉరుకలు చూస్తే కెసిఆర్ బోల్తా పడతాడేమో అని భయం పట్టుకుంది. ఇదే అణువుగా కాంగ్రెస్ పార్టీ చరిత్ర తిరగరాస్తుందా.. అంతర్గత కలహాలకు పోకుండా సీనియర్లతో కలిసి అధికారం చేపట్టే దిశగా అడుగులు వేస్తుందా….కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందా అన్న వారి నోటిని ముయిస్తారా.. ఎవరు కోవర్ట్ లు .. ఆ ముద్ర సీనియర్లు తొలగించుకుంటున్నారా… టిఆర్ఎస్ పార్టీకి తిరుగుబాటు తప్పదా…!? కెసిఆర్ హడావిడి దేనికి సంకేతం… కూతురి కోసమా…. కేటీఆర్ కోసమా..?? గెలుపు గుర్రాల కోసం చేస్తున్న ప్రయత్నం కెసిఆర్ కు బేడిసి కొట్టిందా..
Read Also : మసాజ్ సెంటర్ల పేరుతో వ్యభిచారం.. హైదరాబాద్ లో జోరుగా దందా
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కరెంటు కోతలకు నిరసనగా ఆందోళనచేస్తున్న ప్రజలపై బాషీర్ బాగ్ లో కాల్పులు జరిపి, తీవ్ర వ్యతిరేకతకు గురై ప్రభుత్వాన్ని కోల్పోయింది.
దానిని సెంటిమెంట్ గా తీసుకొని, రైతులకు ఉచిత విద్యుత్ అందిస్తానంటూ
నాటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేసి చరిత్ర సృష్టించారు. అదే బాటలోనే టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి చేపడుతున్న హాత్ సే హాత్ జోడో అభియన్ యాత్ర ప్రజా సమస్యలను తెలుసుకుంటూ అధికార ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలతో కేసీఆర్ ను విమర్శించడమే కాకుండా గద్దె దించేందుకు సాగుతోంది.
ఉచిత హామీలతో ప్రజలను ఆకట్టుకునే విధంగా రేవంత్ రెడ్డి ఇస్తున్న హామీలు మళ్లీ కాంగ్రెస్ పార్టీ పునర్నిర్మానంతో పాటు చరిత్రను తిరగరాస్తుందా …. ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఉచిత హామీలు ఇచ్చి రాష్ట్ర ప్రజలను సోమరిపోతులుగా తయారు చేస్తూ… తాగుబోతులను, తయారు చేశారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Also Read : కాంగ్రెస్ పార్టీతో పొత్తు… రేవంత్ రెడ్డితో విభేదాలపై సిపిఐ పార్టీ నారాయణ కీలక వ్యాక్యలు
ఈ నేపథ్యంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి మళ్ళీ తీసుకోవడం కాంగ్రెస్ పార్టీకి ఊపిరి పోస్తుందా.. సుడిగుండంలో చుట్టుకొస్తున్న సమస్యలను పరిష్కరించలేక భారత రాష్ట్ర సమితి పేరుతో రాష్ట్రాన్ని విడిచి పోవాలని కేసిఆర్ జాతీయ పార్టీ పేరుతో దేశ ప్రజలను నయ వంచన చేసేందుకు కుట్ర జరుగుతుంది, అన్ని వర్గాలను అభివృద్ధి చేస్తానంటూనే దళిత, గిరిజనులను తప్పుదోవ పట్టించేందుకు కేసిఆర్ చేస్తున్న కుట్రలను తిప్పి కొట్టే శక్తి ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ కి ఉంటుంది కానీ.. సీనియర్లు కోవట్లుగా తయారై కాంగ్రెస్ పార్టీని అధికారం రాకుండా రేవంత్ కు చెక్కు పెట్టేందుకు జరుగుతున్న ప్రయత్నాలు బేడిసి కొడుతూనే ఉన్నాయి. నాడు వైయస్ రాజశేఖర్ రెడ్డి పోడు భూములకు పట్టాలిచ్చి ఆదివాసి గిరిజనులలో తిరస్కరమైన అభిమానం పెంచుకున్నారు. కెసిఆర్ ప్రభుత్వం షరతులతో ఇస్తున్న హామీలను ఆదివాసులు తిప్పికొట్టేందుకు రాష్ట్రంలో మరో ఉద్యమాన్ని చేపట్టేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఏరకంగా ఆదివాసులు ఆకట్టుకుంటూ ముందుకు వెళ్తుందో చూడాల్సిన అవసరం కూడా ఉంది. వైయస్ రాజశేఖర్ రెడ్డి చేపట్టిన పథకాలను అమలు చేయాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తూంది.
Read Also : మురారీ సినిమా తరహాలో ఎన్టీఆర్ ఫ్యామిలీని శాపం వెంటాడుతోందా?
మొన్న జరిగిన అసెంబ్లీలో 11 కులాలను యస్. టి తెగలలో చేర్చాలని తీర్మానం చేయడం పై గిరిజన తెగలు రాష్ట్ర ముఖ్యమంత్రి పై మరో ఉద్యమాన్ని చేయాలని అదిలాబాద్ జిల్లా కేస్లాపూర్ లో తీర్మానం చేయడం కూడా జరిగింది. ఇన్ని సమస్యల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆదివాసులపై స్పష్టమైన హామీ ఇస్తేనే ..రాష్ట్రంలో 11 స్థానాలు ఉన్న ఎస్టీ రిజర్వేషన్లు కాంగ్రెస్ కైవాసం చేసుకునే అవకాశం కూడా లేకపోలేదు. ఆదివాసులు సాగు చేస్తున్న పోడు భూములకు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పట్టాలిస్తుందని చేస్తున్న హామీని ఆదివాసి గిరిజనులు స్వాగతిస్తున్నప్పటికీ స్పష్టమైన హామీ ఇవ్వాలని కొన్ని గిరిజన సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అయోమయంలో పడింది. ఇప్పటికే లిక్కర్ స్కాం తో అతలాకుతలంతో కెసిఆర్ ప్రభుత్వం మధ్యంతర ఎన్నికలకు పోయేందుకు పక్క ప్రణాళిక చేపడుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, రేవంత్ రెడ్డి మధ్య అంతర్గత విభేదాలు విడిచి బలమైన ప్రచారం చేస్తేనే… చరిత్ర రాయగలరేమో కానీ.. ఇప్పుడు మాత్రం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తే కెసిఆర్ కే అమ్ముడుపోతారేమో అని ప్రచారం కూడా జరుగుతుంది.
Also Read : సోమేష్ కుమార్ వీఆర్ఎస్‌కి అప్లై చేయడం వెనుక కారణం… బీహార్ బీఆర్ఎస్ అధ్యక్షుడిగా పగ్గాలు..?
ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కెసిఆర్ ఎంతకైనా దిగజారి అధికారం చేపట్టేందుకు కూడా ఆయన వెనుకాడే పరిస్థితి కనిపించదు.. ఇలాంటి పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టడం కలగానే మిగిలిపోయినప్పటికీ దీనిని ఢీకొట్టే విధంగా ప్రతిపక్షంలోనైనా నిలబడుతుందా.. అది కూడా కలగానే మిగిలిపోతుందా.. అనే ప్రశ్నలు ప్రజలలో నాటుకపోయాయి. ఇప్పటికే కొన్ని నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీకి అసలైన నాయకుడు లేకపోవడం కనీసం డిపాజిట్ కూడా వస్తుందా అని ప్రచారం జరుగుతున్నా.. ఎక్కడి నుంచి అయినా ఎన్నారైలు వచ్చి పోటీ చేస్తారని ప్రచారాలు కూడా జరుగుతున్నాయి. టిఆర్ఎస్ పార్టీలో బిజెపి పార్టీలో టికెట్లు రానివారు కాంగ్రెస్ వైపే చూస్తారని భ్రమలో రేవంత్ రెడ్డి ఉన్నారట. నాయకులు లేకపోయినా కార్యకర్తలే కాంగ్రెస్ ను గెలిపిస్తారని.. కచ్చితంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడుతుందని సీనియర్లపై రేవంత్ రెడ్డి పై చేయి సాధిస్తారని ప్రచారం జరుగుతుంది. అది ఎంతవరకు సాధ్యమో కాదో కానీ.. సీనియర్లు ఎప్పుడూ ఏ బాంబు వేస్తారన్న భయం.. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు పట్టుకుంది. సీనియర్ రేవంత్ రెడ్డి వెంట నడిస్తే కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజార్టీ సాధించవచ్చని విశ్లేషకులు అంటున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కుక్కలు చింపిన ఇస్తారుల మారి ఇప్పటికే చచ్చిన పాముల మిగిలిపోయిందని బిజెపి, టీఆర్ఎస్ పార్టీల నాయకులు విమర్శిస్తున్న నేపథ్యంలో విమర్శలు చేసిన వారికి ప్రతి విమర్శలు చేసే విధంగా ఆపార్టీని అధికారం చేపట్టే విధంగా సీనియర్లు పనిచేసేందుకు వారి వద్ద నుండి అవసరమైన సహకారం తీసుకోవాలని, కెసిఆర్ ప్రభుత్వం పై తిరుగుబాటు మొదలైందని దీనిని ఆసరా చేసుకుని అధికార దిశగానే అడుగులు వేసే విధంగా రేవంత్ రెడ్డి, సీనియర్ నాయకులతో పక్క ప్రణాళిక చేసుకొని కాంగ్రెస్ పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్తే కానీ మరోచరిత్ర తిరగరాసేందుకు అవకాశం లేకపోలేదు. ఇప్పటికీ ఇప్పుడే మధ్యంతర ఎన్నికలకు పోయినా కెసిఆర్ కు స్పష్టమైన మెజార్టీ కనిపించట్లేదు. రోజువారి సర్వేలు చేపించుకుంటూ, కొందరు మంత్రులు, ఎంఎల్ఏలు చేస్తున్న దౌర్జన్యాలు , భూఅక్రమాలు వల్ల ప్రభుత్వాన్ని కి చెడ్డ పేరు రావడంతో పాటు అధికారం కోల్పోతుందనే భయం పెట్టుకున్నట్లుంది.
Read Also : ఏపీలో బిఆర్‌ఎస్ మైండ్ గేమ్… 175 స్థానాలలో పోటీ ప్రకటన అందుకేనా???
రాష్ట్రంలో 25 నుండి 36 మంది ఎమ్మెల్యేలకు డిపాజిట్ కూడా రాదనేదీ సర్వేలలో తెలియనట్టు తెలుస్తుంది. కెసిఆర్ రాజకీయం ఏరకంగా రచిస్తున్నారో.. అంతు చిక్కడం లేదు ఎంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇస్తారో..?? ఎవరికి మొండి చేయి చూయిస్తారో..కొత్త వారికి అవకాశం కల్పిస్తారో వేసి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒకవేళ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మొండి చేయిసూహిస్తే… కాంగ్రెస్ పార్టీ బలం పుంజుకుంటున్నట్లే. ఇలాంటి పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ ఎలాంటి ప్రయత్నాలు చేస్తుందో.. రేవంత్ రెడ్డి తన తీరును మార్చుకొని అంతర్గత విభేదాలను పక్కనపెట్టి సీనియర్లని కలుపుకొని… కెసిఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించి చరిత్ర తిరగరాస్తారో… ప్రతిపక్షాన్ని కోల్పోయి.. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చరిత్రకు అంకితమవుతారో వేచి చూడాల్సిందే.
వైయస్ రాజశేఖర్ రెడ్డి బాటలోనే రేవంత్ రెడ్డి
వైయస్ రాజశేఖర్ రెడ్డి బాటలోనే పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి నడుచుకుంటున్నారని సీనియర్లను పక్కన పెట్టడం ఎంతవరకు సమంజసమని, గతంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి కూడా సీనియర్ కాంగ్రెస్ నాయకులను పట్టించుకోలేదని, ఆనాటి పరిస్థితులు వేరు ఈనాటి పరిస్థితులు వేరని అధికారం చేపట్టాలంటే సీనియర్లతో పాటు అందరిని కలుపుకుపోయే లక్షణం రేవంత్ రెడ్డికి ఉండాలని సీనియర్ కాంగ్రెస్ లీడర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బిజెపిని టిఆర్ఎస్ పార్టీ నాయకులను ఢీకొట్టాలంటే అందరి అభిప్రాయాలు తీసుకొని ముందుకు నడుచుకోవాలని అప్పుడే కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడుతుందని సీనియర్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తుంది. రేవంత్ రెడ్డి సీనియర్లతో విభేదాలు వ్యతిరేకతను వీడి అంతర్గత కలహాలకు దూరంగా ఉండి. కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టేందుకు పనిచేయాల్సిందిని సీనియర్లు చెప్పుకొస్తున్నారు . కాంగ్రెస్ పార్టీలో అన్ని సమస్యలు తొలగిపోయాయని కలిసే నడుస్తున్నామని మరో సీనియర్ నాయకుడు పేర్కొనడం గమనార్హం.
వేంకగారి భూమయ్య సీనియర్ జర్నలిస్ట్ వర్తమాన రాజకీయాలపై విశ్లేషణ
ఇవి కూడా చదవండి :
- తెలంగాణలో లేటెస్ట్ సర్వే.. ఏ పార్టీకి ఎన్ని సీట్లంటే!
- కేసీఆర్ వచ్చి పోగానే కొండగట్టులో దొంగలు
- కుక్కలు చంపేస్తుంటే మీరేం చేస్తున్నారు? కేసీఆర్ సర్కార్ పై హైకోర్టు సీరియస్
- నమస్తే ఆంధ్రప్రదేశ్.. ఏపీలో కేసీఆర్ కొత్త పేపర్