
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : సోమవారం ఉదయం ఒడిశాలో బాణా సంచా పేలి ఐదుగురు ప్రాణాలు కోల్పోగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. కుర్దా జిల్లా భూసంగ్‌పూర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. డోలా పూర్ణిమ ఉత్సవాల కోసం బాణా సంచా తయారుచేస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. ఓ ఇంటిలో కొందరు బాణా సంచా తయారుచేస్తుండగా… ఒక్కసారి పేలుడు జరిగింది. ఈ పేలుడులో నివాసానికి కూడా నిప్పంటుకుంది. ఘటనలో తీవ్రంగా గాయపడిన ఐదుగురిలో నలుగురు అక్కడిక్కడే మృతిచెందగా.. ఆస్పత్రికి తరలిస్తుండగా మరొకరు మృతిచెందారు.
Read Also : ర్యాగింగ్ విషయంలో ప్రభుత్వం సీరియస్… మంత్రి హరీశ్ రావు
ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ముగ్గురు పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. పేలుడు తీవ్రతకు ఇల్లు కూలిపోయిందని, లోపలికి వెళ్లేందుకు చాలా సమయం పట్టిందని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. ఘటన గురించి సమాచారం తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలను చేపట్టారు. ఫైర్ ఇంజిన్ల సాయంతో మంటలను అదుపుచేసి.. లోపలి ఉన్న బాధితులను బయటకు తీసే ప్రయత్నం చేశారు. క్షతగాత్రులను చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదవశాత్తూ టపాసులు పేలినట్టు పోలీసులు గుర్తించారు.
Also Read : గ్రామంలో ప్రత్యేక్షమైన పులిపిల్లలు… జనాల సెల్ఫీలు
మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. పోస్ట్‌మార్టం కోసం తరలించారు. భారీ శబ్దంతో పేలుడు సంభవించడంతో స్థానికులు ఇళ్ల నుంచి భయంతో పరుగులు తీశారు. కాగా, గతవారం జగత్సింగ్‌పూర్ గ్రామంలో బాణసంచా పేలి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మరో ఇద్దరు గాయపడ్డారు. ఫాల్గుణ శుద్ధ పౌర్ణమిని డోలా పూర్ణిమిగా జరుపుకుంటారు. డోలోత్సవంలో ఉత్సవమూర్తులైన శ్రీదేవి, భూదేవి, సమేతంగా శ్రీమహావిష్ణువుకు తిరువీధి నిర్వహించి అనంతరం డోలో మండపం ఊయలలో ఉంచుతారు. అక్కడ స్వామిని ఉత్తరాభిముఖంగా భక్తులు దర్శిస్తారు. ఈ ఉత్సవాలను ఒడిశాతో పాటు ఉత్తరాంధ్రలో ఘనంగా నిర్వహిస్తారు.
ఇవి కూడా చదవండి :
- చెరుకు సుధాకర్‌ను ఉద్దేశపూర్వకంగా ఫోన్‌లో తిట్టలేదు… కోమటిరెడ్డి వివరణ
- సాత్విక్ ఆత్మహత్య నేపథ్యంలో ఇంటర్ కాలేజీల యాజమాన్యాలతో మంత్రి కీలక సమావేశం
- నగరంలో పట్టుబడ్డ డ్రగ్స్… విక్రయిస్తుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న పోలీసులు
- చరిత్ర తిరగరాస్తుందా..! ఉచిత హామీలు ఊపిరి పోస్తుందా..!
- తెలంగాణలో లేటెస్ట్ సర్వే.. ఏ పార్టీకి ఎన్ని సీట్లంటే!