
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : ఇంటర్ కాలేజీల్లో విద్యార్థుల వరుస ఆత్మహత్యలతో విద్యాశాఖ అప్రమత్తమైంది. ఆత్మహత్యల ఘటనలపై చర్చించేందుకు సోమవారం ఇంటర్ కాలేజీల యాజమాన్యాలతో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కీలక సమావేశం నిర్వహించనున్నారు. నేడు సాయంత్రం 4 గంటలకు MCRHRDలో జూనియర్ కాలేజీల యాజమాన్యాలతో సబిత భేటీ కానున్నారు. ఈ సమావేశానికి రావాల్సిందిగా దాదాపు 14 ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలకు ఇంటర్ బోర్డు నోటీసులు పంపింది. ఇంటర్ కాలేజీల్లో విద్యార్థుల బలవన్మరణాలు, మార్కుల పేరుతో యాజమాన్యాల ఒత్తిడి లాంటి విషయాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారని తెలుస్తోంది.
Read Also : తెలంగాణలో లేటెస్ట్ సర్వే.. ఏ పార్టీకి ఎన్ని సీట్లంటే!
ఇటీవల నార్సింగిలోని శ్రీ చైతన్య జూనియర్ కాలేజీలో ఇంటర్ ఫస్టియర్ విద్యార్థి సాత్విక్ సూసైడ్ ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన మరువకముందే రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలు చాలా చోటుచేసుకుంటున్నాయి. దీంతో ప్రభుత్వం అలర్ట్ అయినట్లు తెలస్తోంది. సాత్విక్ ఆత్మహత్యపై విద్యాశాఖ తప్పుడు రిపోర్ట్ ఇచ్చిందనే ఆరోపణలు తల్లిదండ్రుల నుంచి వినిపిస్తోన్నాయి. అడ్మిషన్ ఒక కాలేజీలో తీసుకుని మరే కాలేజీలో సాత్విక్ చదువుతున్నట్లు ఆదివారం ప్రభుత్వానికి అందించిన రిపోర్టులో విద్యాశాఖ కమిటీ పేర్కొంది.
Also Read : చరిత్ర తిరగరాస్తుందా..! ఉచిత హామీలు ఊపిరి పోస్తుందా..!
అయితే తాము నార్సింగిలోని కాలేజీలోనే సాత్విక్ అడ్మిషన్ తీసుకున్నామని తల్లిదండ్రులు చెబుతున్నారు. కమిటీ రిపోర్టులో చాలా తప్పులు ఉన్నాయని తల్లిదండ్రులు విమర్శిస్తున్నారు. తప్పుడు రిపోర్ట్ ఇచ్చిన ఇంటర్ బోర్డు అధికారులపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు వస్తోన్నాయి. నిర్లక్ష్యం వహిస్తున్న ఇంటర్ బోర్డుపై చర్యలు తీసుకోవాని విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి. ఈ విషయంలో ప్రభుత్వం నెక్స్ట్ స్టెప్ ఎలా ఉంటుందనేది కూడా కీలకంగా మారింది. నిన్నటి ఎంక్వైరీ రిపోర్ట్‌ల అంశం ఈ సమావేశంలో చర్చకు అవకాశం లేకపోలేదు. దీంతో ఈ సమావేశంలో ఇంటర్ బోర్డు అంశం, కాలేజీ యాజమాన్యాల వ్యవహారంపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలున్నాయని చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి :
- నగరంలో పట్టుబడ్డ డ్రగ్స్… విక్రయిస్తుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న పోలీసులు
- మసాజ్ సెంటర్ల పేరుతో వ్యభిచారం.. హైదరాబాద్ లో జోరుగా దందా
- కుక్కలు చంపేస్తుంటే మీరేం చేస్తున్నారు? కేసీఆర్ సర్కార్ పై హైకోర్టు సీరియస్
- పార్టీ మారిన ఎమ్మెల్యేలపై విరుచుకపడిన రేవంత్ రెడ్డి… కొనసాగుతున్న పాదయాత్ర
- పచ్చని పల్లెలకు కొత్త కష్టం…. గుంపులు గుంపులుగా ఈగల దాడి