
క్రైమ్ మిర్రర్, హైద్రాబాద్ : హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయ లక్ష్మీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేసి.. వార్తల్లో నిలిచారు. అంబర్‌పేటలో వీధి కుక్కల దాడిలో బాలుడు మరణించిన ఘటన సంచలనం కాగా.. ఆ విషయంపై స్పందించిన మేయర్ ఆసక్తికర వ్యాక్యలు చేసి.. తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. కాగా.. ఇప్పుడు మరోసారి.. నగరంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన మేయర్.. ఆ ఘటనపై స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరికో కుక్క కరిస్తే.. ఆ క్కుకలకు తానే కరమవని చెప్పినట్టుగా తనపై విమర్శలు చేస్తున్నారంటూ మండిపడ్డారు.
Read Also : ర్యాగింగ్ విషయంలో ప్రభుత్వం సీరియస్… మంత్రి హరీశ్ రావు
మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న మేయర్ విజయలక్ష్మీ.. అన్ని రంగాల్లో మహిళలు పోటీపడుతున్నారని తెలిపారు. బీఆర్ఎస్‌లో మహిళలకు ప్రత్యేక గుర్తింపు ఇవ్వాలని ఆకాంక్షించారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా.. మహిళలు ముందుకెళ్లాలని సూచించారు. ఈ క్రమంలోనే.. హైదరాబాద్ మేయర్‌గా పని చేయటం అంత సులువు కాదన్నారు గద్వాల విజయలక్ష్మి. వీధి కుక్కల దాడిలో బాలుడు మృతి చెందిన ఘటనలో.. తనపై ఎన్నో విమర్శలు చేశారని బాధపడ్డారు. బాలుడిని కరవమని తానే చెప్పినట్టుగా ఆరోపణలు చేశారని అసహనం వ్యక్తం చేశారు.
Also Read : బాణా సంచా తయారుచేస్తుండగా ప్రమాదం… ఐదుగురి మృతి, ముగ్గురికి తీవ్రగాయాలు
అయితే.. ఇదే ఘటనపై ఇంతకు ముందు కూడా.. మేయర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఘటన జరిగినప్పుడు ప్రెస్ మీటి పెట్టిన మేయర్.. వీధి కుక్కలకు రోజూ మాంసం ఇచ్చే వాళ్లు.. రెండు మూడు రోజులు ఇవ్వకపోతే అవి ఆకలితో దాడులు చేస్తాయంటూ వివరణ ఇచ్చారు. ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారి.. విమర్శలకు దారి తీసింది. మేయర్ వ్యాఖ్యలపై అటు వివాదాస్పద డైరెక్టర్ రాంగోపాల్ వర్మ కూడా ఘాటుగానే స్పందించారు. నగరంలోని ఐదు లక్షల కుక్కలను ఒక గదిలో బంధించి అందులో మేయర్‌ను ఉంచాలంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఇవి కూడా చదవండి :
- గ్రామంలో ప్రత్యేక్షమైన పులిపిల్లలు… జనాల సెల్ఫీలు
- చెరుకు సుధాకర్‌ను ఉద్దేశపూర్వకంగా ఫోన్‌లో తిట్టలేదు… కోమటిరెడ్డి వివరణ
- సాత్విక్ ఆత్మహత్య నేపథ్యంలో ఇంటర్ కాలేజీల యాజమాన్యాలతో మంత్రి కీలక సమావేశం
- నగరంలో పట్టుబడ్డ డ్రగ్స్… విక్రయిస్తుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న పోలీసులు
- చరిత్ర తిరగరాస్తుందా..! ఉచిత హామీలు ఊపిరి పోస్తుందా..!