
క్రైమ్ మిర్రర్, అమరావతి ప్రతినిధి : తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.. పొత్తుల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. పీలేరు నియోజకవర్గంలో మీడియాతో మాట్లాడిన లోకేష్.. విలేకరులు ప్రశ్నలకు ఊహించని సమాధానాలు చెప్పారు. ముఖ్యంగా టిడిపి, జనసేన పొత్తు ఖాయమని ప్రచారం జరుగుతున్న సమయంలో.. లోకేష్ చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. ఇదే సమయంలో.. ముఖ్యమంత్రి జగన్‌పైనా.. లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. తమను చూసి వైఎస్ జగన్ భయపడుతున్నారని వ్యాఖ్యానించారు. ‘టీడీపీ, జనసేన 175 నియోజకవర్గాల్లో ఎందుకు ఒంటరిగా పోటీ చేయడం లేదు? అని వైసీపీ ప్రశ్నిస్తోంది. మీరు ఏమంటారు?’ అని విలేకరులు ప్రశ్నించారు.
Read Also : తెలంగాణలో పూటకో హత్య, గంటకో రేప్… రేపిస్టులంతా బీఆర్ఎస్‌లోనే… బండి సంజయ్
‘జగన్ రెడ్డికి అంత భయం ఎందుకు? టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయని మేం ఎక్కడైనా చెప్పామా? మేం ఎక్కడ పోటీ చేయాలో వాళ్లు నిర్ణయిస్తే మేం పోటీ చేయాలా? ఎన్నికల సమయంలో అప్పటి పరిస్థితులకు అనుగుణంగా మా రాజకీయ వ్యూహాన్ని అమలు చేస్తాం. అయినా.. టీడీపీ, జనసేన మైత్రిని చూసి జగన్ రెడ్డి ఎందుకు భయపడుతున్నారు? 100 సంక్షేమ పథకాలు కట్ చేసిన ప్రభుత్వం జగన్ రెడ్డిది. దానిపై చర్చకు నేను సిద్ధం. జగన్ రెడ్డి నాతో చర్చకు సిద్ధమా?’ అని లోకేష్ ఛాలెంజ్ చేశారు. ‘మీరు అధికారంలోకి వచ్చాక సంక్షేమ పథకాలు రద్దు చేస్తారా?’ అని రిపోర్టర్లు ప్రశ్నించగా.. ‘చంద్రబాబు పాలనలో.. గత ప్రభుత్వం ఇచ్చిన పథకాలు దేన్నీ రద్దు చేయలేదు. ఆరోగ్యశ్రీని రాజశేఖర్ రెడ్డి ప్రారంభించారు. మేం దాన్ని కొనసాగించాం.
Also Read : ప్రజలనే కాకుండా దేవుళ్ళను మోసం చేస్తున్న కేసిఆర్ కుటుంబం… రేవంత్ రెడ్డి
కానీ.. జగన్ మేం అమలు చేసిన పథకాలను పూర్తిగా రద్దు చేశారు. చంద్రాబు పెన్షన్‌ను రూ.200 నుండి రూ.2,000లకు పెంచారు. అంటే ఏకంగా రూ.1,800 పెంచారు. జగన్ సుమారు నాలుగేళ్లలో కేవలం రూ.750 పెంచారు’ అని నారా లోకేష్ వ్యాఖ్యానించారు. ‘సర్పంచిగా కూడా గెలవని వ్యక్తి పాదయాత్ర చేస్తుంటే.. ప్రజలు ఎలా సహకరిస్తారు? ఇది టీడీపీకి శవయాత్ర అంటూ.. అధికార పార్టీ నాయకులు విమర్శలు చేస్తున్నారు. దానికి మీరు ఏమంటారు?’ అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. ‘టీడీపీ ఓడిపోతున్న నియోజకవర్గాన్ని టీడీపీకి కంచుకోటలా మార్చేందుకు నేను మంగళగిరిని ఎంచుకున్నా. జగన్‌లా కుటుంబం ఓట్లు ఉన్న చోట పోటీ చేయలేదు. జగన్‌కు దమ్ముంటే వైసీపీ గెలవని ప్రాంతంలో పోటీ చేసి గెలవమనండి చూద్దాం. నేను ఛాలెంజ్ విసురుతున్నా’ అని లోకేష్ స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి :
- కరవమని కుక్కలకు నేను చెప్పానా… మేయర్ విజయలక్ష్మి అసహనం
- బాణా సంచా తయారుచేస్తుండగా ప్రమాదం… ఐదుగురి మృతి, ముగ్గురికి తీవ్రగాయాలు
- ర్యాగింగ్ విషయంలో ప్రభుత్వం సీరియస్… మంత్రి హరీశ్ రావు
- చెరుకు సుధాకర్‌ను ఉద్దేశపూర్వకంగా ఫోన్‌లో తిట్టలేదు… కోమటిరెడ్డి వివరణ
- చరిత్ర తిరగరాస్తుందా..! ఉచిత హామీలు ఊపిరి పోస్తుందా..!