
తెలంగాణలో ఎన్నికల ఫీవర్ పీక్ స్టేజీకి చేరింది. ముందస్తు ఎన్నికలు వస్తాయనే ప్రచారంతో అన్ని పార్టీలు దూకుడు పెంచాయి. ఏదో ఒక కార్యక్రమంతో జనంలో ఉంటున్నాయి. గెలుపే లక్ష్యంగా బలమైన అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో ఉన్న పార్టీలు నియోజకవర్గాల వారీగా సర్వేలు చేయించుకుంటున్నాయి. దీంతో ప్రస్తుతం తెలంగాణ ఎక్కడ చూసినా సర్వే సంస్థల హడావుడే కనిపిస్తోంది. తాజా పొలిటికల్ లాబోరేటరీ సంస్థ తన సర్వే వివరాలు ప్రకటించింది. ఆ సర్వేలో ఆసక్తికర విషయాలు ఉన్నాయి.
పొలిటికల్ లాబోరేటరి సర్వే ప్రకారం తెలంగాణలో వచ్చే ఎన్నికల వరకూ బండి సంజయ్ గారిని బిజేపి ఛీఫ్‌గా కొనసాగించడం మంచి నిర్ణయమే..! అతనివల్ల ఓట్ బ్యాంక్ గ్రాఫ్ పెరిగిందే తప్ప తరగలేదు. ఇక పార్టీ ఇంటర్నల్ రాజకీయాల గురించి చర్చిస్తే.. అవి ఏ పార్టీలో మాత్రం లేవు? సామరస్యంగా కలుపుకుని పోతే సరి!తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకి ఇక పది నెలల సమయమే ఉన్న తరుణంలో అయితే ఈటల రాజేందర్ గారికి పగ్గాలు ఇవ్వాలి లేదా సంజయ్ గారినే కొనసాగించాలి. అలా జరిగితేనే బిజేపి ఓ 23 లేదా 25 స్థానాల్లో గెలిచే అవకాశాలు ఉన్నాయి. (ప్రస్తుత ట్రెండ్స్ ప్రకారం).
రెండు దశాబ్దాలుగా కేసీయార్ వ్యూహాలను దగ్గర ఉండి చూసిన ఈటల గారిని ఆ పార్టీ ఎన్నికల వ్యూహకర్తగా నియమిస్తే సీట్ల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంటుంది. రఘునందన్ రావ్, డీకే అరుణ, రాజగోపాల్ రెడ్డి, ఈటల రాజేందర్, బండి సంజయ్, విశ్వేశ్వర్ రెడ్డి, అర్వింద్ ధర్మపురిలు అందరూ కలిసి ఏకతాటి పై పోరాడితే తెలంగాణలో హంగ్ ప్రభుత్వం వచ్చేలా చేయవచ్చు.అంద్రూనీ నుంచి బాహర్ వచ్చి (హైదరాబాద్ ఓల్డ్ సిటీలో మాత్రమే కాకుండా) తెలంగాణలో పలు నియోజకవర్గాల్లో ఎమ్ఐఎమ్ పోటీకి దిగితే వచ్చే ఎన్నికలు అమితమైన ఆసక్తిని నెలకొల్పుతాయి.
పార్టీలవారిగా కాకుండా ప్రజాక్షేత్రంలో నేతలు తమ సొంత చరిష్మాతో పోరాడే అవకాశం ఏర్పడుతుంది.రేవంత్ గారి నేతృత్వంలో కాసులు దండిగా ఉన్న యువ నేతలు కాంగ్రెస్ నుంచి పోటీలో దిగితే గతంలో మాదిరిగా ఓ రెండు పదుల సంఖ్యకు చేరువలో నిలబడవచ్చు. కాంగ్రెస్ సెంటిమెంట్ ఓట్ బ్యాంక్ ను ఓన్ చేసుకోడానికి ఇటు బీయారెస్ అటు బిజేపి రెండు పార్టీలు పావులు కదుపుతున్నాయి. శక్రికేంద్రాల మీటింగ్‌లు నిర్వహిస్తూ సంఖ్యాబలంతో పనిలేకుండా స్థానబలం ఉందని నిరూపించడె ప్రయత్నం బిజేపి సాగుతోంది. టీఎస్ కాంగ్రెస్ పార్టీలో ఏర్పడిన చీలికలతో బయటికి రావాలనుకుంటున్న బడా నేతలను బీయారెస్ టార్గెట్ చేస్తోంది. ఈ పరిణామాల వల్ల కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ మూడుగా చీలే ప్రమాదం కూడా లేకపోలేదు.
మూడు నెలల క్రితం తెలంగాణలో బియారెస్ 40 స్థానాలలో మాత్రమే గెలుస్తుందని ఐప్యాక్ రిపోర్ట్ ఒకటి దుమారం రేపిన సంగతి తెలిసిందే. మునుగోడు ఎన్నికల సమయంలో జరిగిన పరిణామాలు బీయారెస్ భవితవ్యాన్ని నిర్దేశించాయి అనుకోవచ్చు. పార్టీని వీడి బిజేపిలోకి వెళ్ళాలనుకున్న కొందరు చరిష్మా గల నేతలు, ఫామ్ హౌస్ ఎపిసోడ్ తర్వాత గమ్మునుండిపోయారు. కేసీయార్ తో పెట్టుకుంటే అసలుకే ఎసరు వస్తుందేమో అన్న భయంతో బయటికి జొప్పలేదు. దాంతో ఆ సర్వే అంచనా అతి కొద్ది సమయంలోనే రివర్స్ అయిపోయింది. తిరిగి సేఫ్ జోన్‌ను చేరుకున్నట్టు కనిపిస్తోంది.ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీయారెస్‌కు 53-54%, బిజేపికి 23-24%, కాంగ్రెస్‌కు 20-21% ఇతరులు 1% శాతం ఓట్లు పడే అవకాశాలున్నట్టు కనిపిస్తున్నాయి.