
కేటుగాళ్లు రోజురోజుకు రెచ్చిపోతున్నారు. కొత్తపుంతలు తొక్కుతూ అక్రమాలకు పాల్పడుతున్నారు. స్పా, మసాజ్ సెంటర్ల పేరుతో వ్యభిచార దందా నిర్వహిస్తున్నారు. పక్క రాష్ట్రాల నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి.. అబ్బాయిలకు వల వేస్తున్నారు. వేలల్లో దోచుకుంటున్నారు.
హైదరాబాద్‌లోని కూకట్ పల్లిలో స్పా, మసాజ్ సెంటర్ల పేరుతో వ్యభిచారం నిర్వహిస్తున్న సెంటర్లపై శుక్రవారం పోలీసులు దాడులు చేశారు. స్పా ముసుగులో వ్యభిచారం చేస్తున్న 15 మందిని అరెస్ట్ చేశారు. ఐదు స్పా సెంటర్లను మూసివేశారు. వారి వద్ద నుంచి 12 మొబైల్ ఫోన్లు.. రూ.15 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు.
స్పా సెంటర్ల పేరుతో వ్యభిచారం చేస్తే ఉక్కుపాదం మోపుతామని సైబరాబాద్ పోలీసులు హెచ్చరించారు. అలాగే పర్మిషన్ లేని స్పా, మసాజ్ సెంటర్లను కూడా మూసివేస్తామన్నారు. అనుమతి లేకుండా స్పా సెంటర్లు నిర్వహిస్తే.. 9490617444 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని సూచించారు