
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : బీఆర్ఎస్‌తో కేసీఆర్ ఫస్ట్ టార్గెట్ ఏపీనే. ఇప్పటికే పార్టీ అధ్యక్షుడిని ప్రకటించేశారు. త్వరలోనే బీఆర్ఎస్ భవన్ కూడా రెడీ చేయనున్నారు. వలసలు, చేరికలు మొదలైపోయాయి. రాజకీయ యుద్ధంలో ఇక మిగిలింది మీడియా మేనేజ్‌మెంటే.ఏపీలో బీఆర్ఎస్ ప్రస్థానం అంత ఈజీ మాత్రం కాకపోవచ్చు. వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీల రూపంలో బలమైన పార్టీలు ఉన్నాయి. కొత్త పార్టీలకు అంతగా స్కోప్ లేదంటున్నారు. అందులోనూ కేసీఆర్‌లాంటి కరుడుగట్టిన తెలంగాణ నేతను ఏపీ వాసులు ఏ మేరకు ఆదరిస్తారంటే.. డౌటే అంటున్నారు. ఈ విషయం గులాబీ బాస్‌కు కూడా తెలుసు. ఆయన లెక్కలు ఆయనకు ఉంటాయి. తోట చంద్రశేఖర్, రావెల కిశోర్‌బాబు లాంటి ఓ స్థాయి ఉన్న నేతలు ఇప్పటికే బీఆర్ఎస్‌లో చేరిపోవడం కేసీఆర్ క్రెడిటే. వీళ్లే కాదు.. ఇంకా చాలామంది ఏపీ ప్రముఖులతో గులాబీ బాస్ టచ్‌లో ఉన్నారంటూ లీకులు వస్తున్నాయి.
Read More : చిన్నారికి అరుదైన వ్యాధి… 11 కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చిన గుర్తుతెలియని వ్యక్తి
పొలిటికల్‌గా ఎంత ట్రై చేసినా.. మీడియా సహకారం అంతకంటే చాలాముఖ్యం. బీఆర్ఎస్, కేసీఆర్ గురించి పాజిటివ్ న్యూస్ రావడం ఇంపార్టెంట్. మరి, ఇప్పుడున్న మీడియా.. ఏపీ బీఆర్ఎస్‌ను భుజానికి ఎత్తుకుంటుందా? కేసీఆర్ గురించి ఆల్ గుడ్ తరహా న్యూస్ ఇస్తుందా? ఛాన్సెస్ తక్కువే. అందుకే, మిగతా మీడియాలో మనకేంటి.. మనమే ఓ సొంత మీడియా పెట్టుకుంటే పోలా.. అంటూ కేసీఆర్ ఏర్పాట్లు చేసుకుంటున్నారని తెలుస్తోంది. తెలంగాణలో టీ న్యూస్ టీవీ ఛానెల్, నమస్తే తెలంగాణ న్యూస్ పేపర్ ఉన్నట్టుగానే.. త్వరలోనే ఏపీలో ‘నమస్తే ఆంధ్రప్రదేశ్’ పేపర్ తీసుకురానున్నారు.
Read More : అంబర్‌పేట్ కుక్కల దాడి ఘటన… ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్
ఢిల్లీలోని ఆర్ఎన్ఐ (రిజిస్ట్రార్ ఆఫ్ న్యూస్ పేపర్స్ ఫర్ ఇండియా) దగ్గర ‘నమస్తే ఆంధ్రప్రదేశ్’ పేరుతో టైటిల్‌ను రిజిస్టర్ చేయించారు. ప్రస్తుతం ‘నమస్తే తెలంగాణ’ పత్రికను ప్రచురిస్తున్న తెలంగాణ పబ్లికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ తరఫునే ‘నమస్తే ఆంధ్రప్రదేశ్’ టైటిల్ రిజిస్ట్రేషన్ జరిగింది. అడ్రస్ మాత్రం హైదరాబాద్‌దే ఉంది. తెలంగాణలోనే ప్రింట్ చేసి ఏపీకి న్యూస్ పేపర్స్ పంపించే ఆలోచన ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం నమస్తే ఆంధ్రప్రదేశ్ కే పరిమితమైనా.. ముందుముందు బీఆర్ఎస్ ఎంట్రీ ఇచ్చే అన్నిరాష్ట్రాల్లోనూ పార్టీతో పాటు సొంత మీడియా సైతం అడుగుపెడుతుందని అంటున్నారు. భవిష్యత్తులో అన్ని భాషల్లో నమస్తే న్యూస్ పేపర్లు వచ్చినా ఆశ్చర్యం అవసరం లేదంటున్నారు. ఇలా సొంత మీడియాతో కారును మరింత దూకుడుగా నడిపించవచ్చనేది కేసీఆర్ ఆలోచనగా కనిపిస్తోంది. పేపర్ పెడతారు సరే.. మరి ప్రజలు ఆదరిస్తారా? నమస్తే అంటే నమ్మేస్తారా?
ఇవి కూడా చదవండి …
- టీడీపీలో చేరిన మాజీమంత్రి కన్నా లక్ష్మీనారాయణ.. జగన్ పై విమర్శలు
- హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోటీకి దూరంగా బిజేపి..చివరి నిమిషంలో నిర్ణయం
- హైదరాబాద్‌లో దారుణ హత్య కలకలం… ప్రేక్షక పాత్ర పోషించిన వాహనదారులు
- అత్యంత విషమంగా మెడికో విద్యార్థిని ప్రీతి ఆరోగ్యం… ఏం చెప్పలేమంటున్న నిమ్స్ డాక్టర్లు