
క్రైమ్ మిర్రర్, సినిమా డెస్క్ : తెలుగు బుల్లి తెర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న సీరియల్ కార్తీక దీపం. తెలుగులోనే కాదు.. ఎంటైర్ ఇండియాలోనే టాప్ సీరియల్‌గా కార్తీక దీపం నిలిచింది. చాలా ఏళ్ల పాటు ఆడియెన్స్‌ను ఈ సీరియల్ ఆకట్టుకుంది. డాక్టర్ బాబు, వంటలక్క పాత్రలను ప్రేక్షకులు అంత సులభంగా మరచిపోలేరు. 2017లో ప్రారంభం అయిన ఈ సీరియల్ దాదాపు ఆరేళ్ల పాటు అప్రతిహాతంగా సాగింది. ఈ సీరియల్‌లో అందరినీ ప్రధానంగా ఆకట్టుకున్న పాత్ర దీప పాత్రలో నటించిన వంటలక్క. ఆడియెన్స్‌కి వంటలక్కగానే గుర్తున్న ఆమె అసలు పేరు ప్రేమి విశ్వనాథ్. ఇంత పేరున్న ప్రేమ విశ్వనాథ్ ఇప్పుడొక అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
Read More : హైదరాబాద్‌లో దారుణ హత్య కలకలం… ప్రేక్షక పాత్ర పోషించిన వాహనదారులు
ప్రేమి విశ్వనాథ్ శరీరంపై మచ్చలు వస్తున్నాయట. అందుకు కారణంగా ఆమె వంటలక్క పాత్ర చేస్తున్నప్పుడు ఆ పాత్ర కోసం నల్లటి మేకప్‌ను ఎక్కువ డోస్‌లో తీసుకోవటంతోనే ఆమెకు చర్మ సమస్య వచ్చింది. ప్రస్తుతం వంటలక్క తన చర్మ వ్యాధికి ఆమె చికిత్స తీసుకుంటోందట. గతంలో అంటే సీరియల్ మధ్యలో కూడా ఆమె ఇటువంటి చర్మ సమస్యతో బాధపడటంతో.. కొన్ని ఎపిసోడ్స్ పాటు ఆమెను దూరం పెట్టారు. ప్రస్తుతం ఆమె ఈ స్కిన్ సమస్య నుంచి బయటపడే ప్రయత్నాల్లో ఉందనేలా టాక్ వినబడుతోంది.అయితే దీనిపై ప్రేమి విశ్వనాథ్ అధికారికంగా ఎక్కడా చెప్పలేదు. త్వరలోనే కార్తీక దీపం 2 ఉంటుందని మేకర్స్ హింట్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
Read More : వైఎస్సార్ మిగలలేదు.. కేసీఆర్ కు నరకమే! కేఏ పాల్ శాపనార్ధాలు
ప్రేమి విశ్వనాథ్ ఇప్పుడు సిల్వర్ స్క్రీన్‌పై సందడి చేయటానికి సిద్ధమైంది. నాగ చైతన్య హీరోగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందుతోన్న తెలుగు, తమిళ చిత్రం కస్టడీ. ఈ చిత్రంలో వంటలక్క ఓ కీలక పాత్రలో కనిపించనుంది. ఆమె ఏ పాత్రలో నటించిందనే సంగతి తెలియాలంటే సినిమా రిలీజ్ వరకు ఆగాల్సిందే.
ఇవి కూడా చదవండి …
-
అత్యంత విషమంగా మెడికో విద్యార్థిని ప్రీతి ఆరోగ్యం… ఏం చెప్పలేమంటున్న నిమ్స్ డాక్టర్లు
-
పార్టీ మారిన ఎమ్మెల్యేలపై విరుచుకపడిన రేవంత్ రెడ్డి… కొనసాగుతున్న పాదయాత్ర
-
ఏపీలో బిఆర్‌ఎస్ మైండ్ గేమ్… 175 స్థానాలలో పోటీ ప్రకటన అందుకేనా???
-
పచ్చని పల్లెలకు కొత్త కష్టం…. గుంపులు గుంపులుగా ఈగల దాడి
One Comment