
క్రైమ్ మిర్రర్, అమరావతి : మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ తెలుగుదేశం పార్టీలో చేరారు. గుంటూరులోని తన నివాసం నుంచి అనుచరులు, అభిమానులతో కలిసి భారీ ర్యాలీగా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. ముందుగా నిర్ణయించుకున్న ముహూర్తం ప్రకారం.. మధ్యాహ్నం 2.48 గంటలకు చంద్రబాబు సమక్షంలో కన్నా తెలుగుదేశం పార్టీలో చేరారు. చంద్రబాబు పసుపు కండువా కప్పి.. కన్నా లక్ష్మీనారాయణను పార్టీలోకి ఆహ్వానించారు. కన్నాతో పాటు ఆయన అనుచరులు టీడీపీ కండువా కప్పుకున్నారు.
Read Also : హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోటీకి దూరంగా బిజేపి..చివరి నిమిషంలో నిర్ణయం
కన్నా చేరిక సందర్భంగా చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. కన్నా లక్ష్మీనారాయణ పార్టీలోకి రావడం శుభపరిణామమని అన్నారు. కన్నాను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నానని చెప్పారు. ‘రాష్ట్రంలో తనకంటూ ఒక ప్రత్యేకత ఉన్న వ్యక్తి కన్నా లక్ష్మీనారాయణ. విద్యార్థి దశ నుంచి అంచెలంచెలుగా ఎదిగారు. వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2004 నుంచి 2014 వరకు మంత్రిగా సేవలందించారు. రాజకీయాల్లో నిబద్ధత ప్రకారం కన్నా పనిచేశారు. పదవులు ఎప్పుడూ శాశ్వతం కాదు.. రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం’ అని చంద్రబాబు కొనియాడారు. తాను చంద్రబాబుతో మొదటి నుంచి పోరాటం చేసిన వ్యక్తి అని కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. చాలా మందికి టీడీపీలో తానెందుకుచేరుతున్నాననే అనుమానాలు కూడా రావొచ్చన్నారు. చంద్రబాబు చెప్పినట్లు రాష్ట్రంలో రాక్షస పాలన జరుగుతోందని, రాక్షస క్రీడను ఈ రాష్ట్రం నుంచి పారద్రోలాలంటే ప్రజాస్వామ్యవాదులంతా కలిసిరావాల్సిన అవసరముందని తెలిపారు.
Also Read : హైదరాబాద్‌లో దారుణ హత్య కలకలం… ప్రేక్షక పాత్ర పోషించిన వాహనదారులు
ఒక్క ఛాన్స్ ఇవ్వండి, తండ్రిని మరిపిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చి, రాష్ట్ర సంపదంతా కేంద్రీకృతంగా చేసుకుని వ్యాపారం చేసుకుంటున్నాడని జగన్ పై కన్నా విమర్శలు గుప్పించారు.రాష్ట్రంలో పేద బడుగు వర్గాల సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదన్నారు. సంక్షేమం అంటే చాక్లెట్ ఇచ్చేది కాదన్నారు. ప్రజలకు చాక్లెట్లు పంచే పేరుతో వేల కోట్ల అప్పులు తెస్తున్నారని విమర్శించారు. అధికారంలోకి వచ్చాక అమరావతినే రాజధానిగా కొనసాగిస్తానని అధికారంలోకి వచ్చాక మూడు రాజధానుల్ని తెరపైకి తెచ్చారని ఆరోపించారు. అభివృద్ధి చెందిన విశాఖ దోచుకోవడానికి రెడీగా ఉంటుందనే రాజధాని చేస్తున్నారన్నారు.ఏపీ అభివృద్ధి, భవిష్యత్, రాజధాని అమరావతిని దృష్టిలో పెట్టుకుని టీడీపీలో చేరుతున్నట్లు కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు.
ఇవి కూడా చదవండి :
- అత్యంత విషమంగా మెడికో విద్యార్థిని ప్రీతి ఆరోగ్యం… ఏం చెప్పలేమంటున్న నిమ్స్ డాక్టర్లు
- పార్టీ మారిన ఎమ్మెల్యేలపై విరుచుకపడిన రేవంత్ రెడ్డి… కొనసాగుతున్న పాదయాత్ర
- పచ్చని పల్లెలకు కొత్త కష్టం…. గుంపులు గుంపులుగా ఈగల దాడి
- ఏపీలో బిఆర్‌ఎస్ మైండ్ గేమ్… 175 స్థానాలలో పోటీ ప్రకటన అందుకేనా???
2 Comments