
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : తెలంగాణ ఫైర్ బ్రాండ్, టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. పాదయాత్ర వేదికగా రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం కేసీఆర్ పైన, బీఆర్ఎస్ పార్టీ మంత్రులపైన, పాదయాత్ర చేస్తున్న ప్రాంతాలలో స్థానిక ఎమ్మెల్యేల పైన తనదైన శైలిలో మండిపడుతున్నారు. మాటల తూటాలను పేలుస్తూ రాజకీయాలను హీటెక్కిస్తున్నారు. తాజాగా భూపాలపల్లి జిల్లాలో పాదయాత్ర నిర్వహించిన రేవంత్ రెడ్డి స్థానిక టిఆర్ఎస్ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డిని టార్గెట్ చేశారు. గతంలో గండ్ర వెంకట రమణారెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి, టిఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీని మోసం చేసి బీఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్యేలను ఉద్దేశించి రేవంత్ రెడ్డి తనదైన శైలిలో నిప్పులు చెరిగారు.
Read Also : ఏపీలో బిఆర్‌ఎస్ మైండ్ గేమ్… 175 స్థానాలలో పోటీ ప్రకటన అందుకేనా???
ఒక గండ్ర వెంకట రమణారెడ్డి మాత్రమే కాకుండా, కాంగ్రెస్ పార్టీ నుండి పార్టీ మారిన నేతలందరి పైన ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. మేం గెలిపిస్తే మా గుండెల మీద తన్ని ఆస్తులు సంపాదన కోసం కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ లో చేరిన డర్టీ డజన్ ఎమ్మెల్యేలు ప్రస్తుతం దొరగాని దొడ్లో పశువులుగా మారారు అంటూ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు సీఎం కేసీఆర్ ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేసిన రేవంత్ నక్సలైట్ అజెండా అంటివి ఏమైంది అంటూ ప్రశ్నించారు. ఇతర పార్టీల నుండి వచ్చిన, మోసం చేసిన కోవర్టులకే మంత్రి పదవులా .. అంటూ ఘాటుగా విమర్శలు చేశారు. బీఆర్ఎస్ నాయకులు ధరణితో దందాలు చేస్తున్నారని, భూకబ్జాలకు పాల్పడుతూ పేదల భూములు లాక్కుంటున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో ఉద్యోగాలు లేక, ఉపాధి దొరక్క, నిరుద్యోగ యువత తీవ్ర మనస్థాపానికి గురి ఆత్మహత్యలు చేసుకుంటున్నారని రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read : పచ్చని పల్లెలకు కొత్త కష్టం…. గుంపులు గుంపులుగా ఈగల దాడి
సీఎం కేసీఆర్, ఆయన కుటుంబం మాత్రం ప్రస్తుతం సంతోషంగా ఉందని, ప్రజలంతా బాధలో ఉన్నారని రేవంత్ రెడ్డి మండిపడుతున్నారు. కెసిఆర్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చేసింది ఏమీ లేదని, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోని కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ముదనష్టపోళ్ళు అంటూ తిట్టిపోశారు. పసి పిల్లల్ని కుక్కలు పీక్కొని తింటే పట్టించుకోని దుర్మార్గ ప్రభుత్వం ఇదని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్రం తెచ్చారని రెండుసార్లు బి ఆర్ ఎస్ కు అధికారం కట్టబెట్టారని, తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ కు ఒక్కసారి అవకాశం ఇవ్వాలంటూ రేవంత్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Read Also : ఆప్‌దే ఢిల్లీ మేయర్ పీఠం.. మేయర్ ఎన్నికల్లో ఆప్ అభ్యర్థి షెల్లీ విజయం
తాము అధికారంలోకి వస్తే 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని, రెండు లక్షల రైతు రుణమాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అంతేకాదు సొంతింటి నిర్మాణం కోసం ఐదు లక్షల రూపాయలు ఇస్తామని రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఇక ఇదే సమయంలో స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి పైన రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేసి ఆయనకు సవాల్ విసిరారు. గండ్ర ఆస్తి మొత్తం కాంగ్రెస్ పార్టీదేనని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆయనను ఎమ్మెల్యేను చేసింది.. చీఫ్ విప్ ను చేసింది కాంగ్రెస్ పార్టీ అని పేర్కొన్న ఆయన, ఈ విషయాలపై మొగుళ్లపల్లి మండల కేంద్రంలోని రాజీవ్ గాంధీ విగ్రహం సాక్షిగా విచారణకు సిద్ధమా అంటూ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి కి సవాల్ విసిరారు.
ఇవి కూడా చదవండి :
- కాంగ్రెస్ పార్టీతో పొత్తు… రేవంత్ రెడ్డితో విభేదాలపై సిపిఐ పార్టీ నారాయణ కీలక వ్యాక్యలు
- మురారీ సినిమా తరహాలో ఎన్టీఆర్ ఫ్యామిలీని శాపం వెంటాడుతోందా?
- వ్యభిచార దందాలో ఎస్‌ఐ తల్లి, తమ్ముడు.. పోలీస్ శాఖలో కలకలం
- కంటోన్మెంట్ ఉప ఎన్నికపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ… ఈ స్థానంపై యువనేతల ఫోకస్
- కేటీఆర్ ఆ కుటుంబానికి ఆదుకోవాలి… రేవంత్ రెడ్డి
One Comment