
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : ఆ గ్రామాలకు కొత్త కష్టం వచ్చింది. ఇప్పటి వరకు కోతుల గుంపుతో సతమతమవుతున్న ఆ గ్రామాలకు ఈగల రూపంలో మరో కష్టం వచ్చి పడింది. ఇళ్లు, పొలాలు ఎక్కడా చూసునా గుంపులు గుంపులుగా ఈగల దండు దాడి చేస్తోంది. కనీసం భోజనం చేసే అవకాశం లేకుండా ఈగలు ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం రాజరాజేశ్వరతండా, సోనాపూర్, గోపాల్ పేట్, గోపాల్ పెట్ తండా, అర్కాయితండా, రాణాపూర్ గ్రామాల్లో ఈగలు గంపులు గుంపులుగా దాడి చేస్తూ.. ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.
Read Also : కాంగ్రెస్ పార్టీతో పొత్తు… రేవంత్ రెడ్డితో విభేదాలపై సిపిఐ పార్టీ నారాయణ కీలక వ్యాక్యలు
ఇంట్లో ఉన్నా, వీధుల్లోకి వెళ్లినా.. రెండు చేతులు అటూ ఇటూ ఊపుతూ వెళ్లాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. శుభకార్యాలు చేసే వారి అవస్థలు చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవల గోపాల్‌పేట్‌తండాలో రెండు వివాహ శుభకార్యాలు జరగ్గా.. వచ్చిన బంధువులు, స్నేహితులు ఈగల వల్ల తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని గ్రామస్థులు వాపోతున్నారు. చుట్టాలు తమ గ్రామాలకు రావాలంటేనే హడలిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ గ్రామాల్లో పరిశుభ్రంగానే ఉన్నాయని.., నిత్యం పంచాయతీ సిబ్బంది శానిటేషన్ చేసినా.. గ్రామాలపై ఈగల గుంపులు దాడి చేస్తున్నాయని అంటున్నారు. ఈగల కారణంగా అంటు వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని వాపోతున్నారు.
Also Read : ఆప్‌దే ఢిల్లీ మేయర్ పీఠం.. మేయర్ ఎన్నికల్లో ఆప్ అభ్యర్థి షెల్లీ విజయం
ఆ గ్రామాల చుట్టూ పచ్చని పంట పొలాలు, హరిత వనాలతో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. కానీ ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున ఈగలు గుంపులు గుంపులుగా దాడి చేస్తున్నాయి. గోపాల్‌పేట్ తండా సమీపంలో ఏర్పాటు చేసిన పౌల్ట్రీఫామ్ కారణంగా తమ గ్రామాల్లోకి ఈగలు వస్తున్నాయని గ్రామస్థులు అంటున్నారు. ఐదు నెలల క్రితమే పౌల్ట్రీఫామ్ ఏర్పాటు చేశారని అప్పటి నుంచే తమకు ఈగల బెడద మెుదలైందని వాపోతున్నారు. ఈగల దాడి నుంచి తమను రక్షించాలని గ్రామస్థులు వేడుకొంటున్నారు.
ఇవి కూడా చదవండి :
- వ్యభిచార దందాలో ఎస్‌ఐ తల్లి, తమ్ముడు.. పోలీస్ శాఖలో కలకలం
- మురారీ సినిమా తరహాలో ఎన్టీఆర్ ఫ్యామిలీని శాపం వెంటాడుతోందా?
- కంటోన్మెంట్ ఉప ఎన్నికపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ… ఈ స్థానంపై యువనేతల ఫోకస్
- కేటీఆర్ ఆ కుటుంబానికి ఆదుకోవాలి… రేవంత్ రెడ్డి డిమాండ్
- సోమేష్ కుమార్ వీఆర్ఎస్‌కి అప్లై చేయడం వెనుక కారణం… బీహార్ బీఆర్ఎస్ అధ్యక్షుడిగా పగ్గాలు..?
One Comment