
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : అరుదైన వ్యాధితో బాధపడుతున్న ఓ చిన్నారి చికిత్స కోసం గుర్తుతెలియని ఓ వ్యక్తి రూ.11 కోట్లు విరాళంగా ఇచ్చి గొప్ప మనసు చాటుకున్నాడు. బ్యాంకు ఖాతాకు డబ్బు జమచేశాడు కానీ.. తన వివరాలేవీ చెప్పలేదు. విదేశాల్లో ఉండే ఆయన.. చిన్నారి ప్రాణాలను నిలబెట్టడానికి తనవంతుగా భారీ సాయం చేసి ఆ కుటుంబాన్ని ఆదుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. కేరళలోని ఎర్నాకుళానికి చెందిన నౌకాదళ అధికారి సారంగ్, అతిథి దంపతుల కుమారుడు 16 నెలల నిర్వాణ్ స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ టైప్-2 అనే వ్యాధితో బాధపడుతున్నాడు. నిర్వాణ్ పుట్టి 15 నెలలైనా కూడా కాళ్లు కదపలేదు.
Read Also : అంబర్‌పేట్ కుక్కల దాడి ఘటన… ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్
దీంతో సారంగ్ దంపతులను జనవరిలో వైద్యులు సంప్రదించగా.. స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ టైప్-2 ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. అరుదైన ఈ వ్యాధికి రెండేళ్లు నిండకుండా కొన్ని రకాల ఔషధాలు వాడితేనే చికిత్సకు వీలవుతుందని వైద్యులు సూచించారు. ఈ ఔషధాలను అమెరికా నుంచి తెప్పించాల్సి ఉంటుంది.. రూ.17.5 కోట్లు ఖర్చవుతుందని చెప్పారు. బాబుకు చికిత్స చేయించేందుకు అవసరమైన సొమ్ము లేకపోవడంతో తమ ఆర్ధిక పరిస్థితి దృష్ట్యా నిర్వాణ్ తల్లిదండ్రులు ఆర్థిక సహాయం కోసం క్రౌండ్ ఫండింగ్ ప్రారంభించారు. దీంతో పలువురు దాతలు బాబు ఖాతాలోకి విరాళాలను జమ చేస్తున్నారు. ఫిబ్రవరి 19 వరకూ ఖాతాలో రూ.5.42 కోట్లు విరాళాలు రాగా.. ఫిబ్రవరి 20కి అది రూ.16 కోట్లు దాటింది.
Also Read : టీడీపీలో చేరిన మాజీమంత్రి కన్నా లక్ష్మీనారాయణ.. జగన్ పై విమర్శలు
తన పేరు చెప్పకుండా ఓ వ్యక్తి రూ.11 కోట్లు జమచేసినట్టు సారంగ్ కుటుంబం ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది. విదేశాల్లో ఉండే అతడు 1.4 మిలియన్ డాలర్లు జమ చేశాడని చెప్పింది. దీంతో నిర్వాణ్ చికిత్సకు సరిపడే నగదు కష్టాలు దాదాపు తీరినట్టు. ఆర్థిక కష్టాలు దాదాపు ఓ కొలిక్కి వచ్చినట్లైంది. మరో రూ.80 లక్షలు వస్తే నిర్వాణ్ చికిత్సకు సరిపడా డబ్బులు సమకూరినట్లే. ఇప్పటి వరకూ 72 వేల మంది దాతలు విరాళాలు ఇచ్చారు. ‘స్పైనల్ మస్క్యులర్ అట్రాఫీ టైప్-2 ఇది ప్రపంచంలోనే అత్యంత అరుదైన వ్యాధి. మెడ నిలబడకపోవడమే దీని ప్రధాన లక్షణం. ఈ వ్యాధిని నయం చేయాలంటే నొవార్టిస్ ఫార్మా తయారు చేసిన రూ.16 కోట్లు ఖరీదైన జొల్జెన్‌స్మా ఇంజక్షన్. ప్రపంచంలోనే ఇది అత్యంత ఖరీదైన ఔషధం. SMAలో టైప్-2 చాలా డేంజర్. జన్యుపరమైన ఈ వ్యాధికి జీన్ థెరపీ అనే చికిత్సా విధానం అందుబాటులో ఉంది.
ఇవి కూడా చదవండి :
- హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోటీకి దూరంగా బిజేపి..చివరి నిమిషంలో నిర్ణయం
- హైదరాబాద్‌లో దారుణ హత్య కలకలం… ప్రేక్షక పాత్ర పోషించిన వాహనదారులు
- అత్యంత విషమంగా మెడికో విద్యార్థిని ప్రీతి ఆరోగ్యం… ఏం చెప్పలేమంటున్న నిమ్స్ డాక్టర్లు
- పార్టీ మారిన ఎమ్మెల్యేలపై విరుచుకపడిన రేవంత్ రెడ్డి… కొనసాగుతున్న పాదయాత్ర
- ఏపీలో బిఆర్‌ఎస్ మైండ్ గేమ్… 175 స్థానాలలో పోటీ ప్రకటన అందుకేనా???
2 Comments