
క్రైమ్ మిర్రర్, వరంగల్ జిల్లా ప్రతినిధి : కొబ్బరి బొండాల మాటున గంజాయి స్మగ్లింగ్ కు పాల్పడుతున్న ఉప సర్పంచ్ ముఠాను వరంగల్ కమీషనరేట్ పోలీసులు అరెస్ట్ చేశారు. వరంగల్ జిల్లా నీరుకుళ్ల గ్రామ ఉప సర్పంచ్ ముసిక లక్ష్మణ్ తోపాటు ఈజీగా డబ్బు సంపాదించడానికి ఏపీ నుండి తెలంగాణ రాష్ట్రానికి గంజాయిని తెచ్చి దందాకు పాల్పడుతున్న నలుగురు సభ్యుల ముఠాను పోలీసులు పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ పోలీసులు మరియు ఆత్మకూరు పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన సోదాలలో ఏపీ నుండి తెలంగాణకు గంజాయి తెస్తున్న ఉప సర్పంచ్ గ్యాంగ్ పట్టుబడింది.
Read Also : సోమేష్ కుమార్ వీఆర్ఎస్‌కి అప్లై చేయడం వెనుక కారణం… బీహార్ బీఆర్ఎస్ అధ్యక్షుడిగా పగ్గాలు..?
వీరి నుండి 34 లక్షల రూపాయల విలువగల 170 కిలోల గంజాయిని, ఒక కారును, గంజాయి రవాణాకు వినియోగించిన ఒక బొలెరో వాహనాన్ని, మూడు సెల్ ఫోన్ లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం గోరుకొత్తపల్లి కి చెందిన రాయలేని శంకర్, ఆత్మకూరు మండలం వరంగల్ జిల్లా నీరుకుళ్ళ గ్రామానికి చెందిన ముసిక లక్ష్మణ్, ములుగు జిల్లా బండారుపల్లి కి చెందిన మహేష్, ములుగు పస్రా కు చెందిన సతీష్ ఉన్నారని పోలీసులు వెల్లడించారు. ఇక అరెస్టుకు సంబంధించి ఈస్ట్ జోన్ డిసిపి కరుణాకర్ వివరాలను వెల్లడించారు. సులభంగా డబ్బు సంపాదించాలన్న ఉద్దేశంతో రాయినేని శంకర్, నీరుకుళ్ళ ఉప సర్పంచ్ ముసిక లక్ష్మణ్ తో కలిసి ఏపీ నుండి గంజాయిని తక్కువ ధరకు కొనుగోలు చేసి, ఎక్కువ ధరకు ఇక్కడ విక్రయించాలని నిర్ణయించారు.
Also Read : 66 అడుగుల బావిలో పడిన వృద్ధురాలు.. క్షేమంగా రక్షించిన అగ్నిమాపక సిబ్బంది
ఇందులో భాగంగా నిందితులు ఏపీ లోని నర్సీపట్నంలో నూకరాజు అనే వ్యక్తి ద్వారా 170 కిలోల గంజాయిని కొనుగోలు చేసి, రెండు ప్యాకెట్ లో వాటిని ప్యాక్ చేసి దానిని కొబ్బరి బొండాల మాటున రహస్యంగా భద్రపరిచి వరంగల్ కు తరలించారు. ఇక ఈ బొలెరో వాహనానికి ఎస్కార్ట్ గా శంకర్, నీరుకుళ్ళ గ్రామ ఉపసర్పంచ్ లక్ష్మణ్ వ్యవహరించారు. వీరిద్దరికీ గంజాయి రవాణా చెయ్యటం కోసం మహేష్, సతీష్ లు సహాయం చేశారు. సమాచారం మేరకు పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీలలో సోదా చేసిన పోలీసులు కొబ్బరి బొండాల క్రింద రెండు ప్యాకెట్లలో గంజాయిని పట్టుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.
ఇవి కూడా చదవండి :
- బీఆర్ఎస్ ప్రభుత్వ ఓటమిని ఆ దేవుడు కూడా కాపాడలేడు…ఈటల రాజేందర్
- ఖదీర్ ఖాన్ మృతిపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్నిఆదేశించిన హైకోర్ట్…
- ఆస్తుల సృష్టిలో తెలంగాణ ప్రభుత్వం అగ్రస్థానం….
- నీరా తాగిన వైఎస్ షర్మిల… కల్లు గీత కార్మికుల సమస్యలపై ఆరా