
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : పోలీస్ డిపార్ట్‌మెంట్ ఉలిక్కిపడేలా చేసిన ఘటన ఇది. విషయం తెలిసి ఖాకీలే నోరెళ్లబెట్టారు. ఈ కేసుపై పోలీస్ శాఖలో అంతర్గతంగా విచారణ కూడా జరిపేందుకు సిద్ధమవుతున్నారు.తిరుపతి పోలీసులకు పక్కా ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఫలానా చోట వ్యభిచారం జరుగుతోందని సమాచారం అందింది. ఖాకీలు క్రాస్ చెక్ చేసుకున్నారు. మేటర్ నిజమేనని కన్ఫామ్ చేసుకున్నారు. వన్ ఫైన్ డే ఆ వ్యభిచార గృహంపై దాడి చేశారు. అక్కడ తెలిసిన విషయం చూసి పోలీసులు అవాక్కయ్యారు. ఇంతకీ ఏం తెలిసింది?
Read Also : మురారీ సినిమా తరహాలో ఎన్టీఆర్ ఫ్యామిలీని శాపం వెంటాడుతోందా?
తిరుపతి ముత్యాలరెడ్డిపల్లి పోలీసులు ఆ ఇంటిపై దాడి చేయగా.. అక్కడ వ్యభిచారం జరుగుతున్న విషయం నిజమేనని తేలింది. ఇద్దరు యువతులను, ఓ విటుడిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ దందా చేస్తున్న మహిళను, ఆమె కొడుకును అదుపులోకి తీసుకున్నారు. ఇక్కడే ఖతర్నాక్ ట్విస్ట్ ఉంది.యువతులను తీసుకొచ్చి.. విటులను ఆకర్షించి.. ఆ వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తున్న మహిళ.. ఓ ఎస్సై తల్లి అని తేలింది. అది కూడా మహిళా ఎస్సైనే అట. ఆ లేడీ ఎస్సై తల్లితో పాటు ఆమె తమ్ముడు కూడా ఇదే దందాలో ఉన్నాడు. అలా ఎస్సై తల్లి, తమ్ముడు కలిసి ఈ గలీజ్ దందా చేస్తున్నట్టు పోలీసులకు తెలిసి కంగుతిన్నారు. విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేశారు.
Also Read : కంటోన్మెంట్ ఉప ఎన్నికపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ… ఈ స్థానంపై యువనేతల ఫోకస్
ఆ మహిళా ఎస్‌ఐకి ఏడాది క్రితం వివాహం అయింది. ప్రస్తుతం ఆమె భర్తతో కలిసి వేరుగా ఉంటోంది. ఆమె తల్లి, తమ్ముడు ఎంఆర్‌పల్లి సమీపంలోని ధనలక్ష్మినగర్‌లో ఉంటూ వ్యభిచార గృహం నిర్వహిస్తున్నారు. మరి, ఈ విషయం ఆ మహిళా ఎస్సైకి తెలుసా? ఆమెకు తెలిసే ఇదంతా జరుగుతోందా? ఈ దందాలో ఆమె ప్రమేయం కూడా ఉందా? లేదంటే, కుటుంబసభ్యులకు ఆమెకు ఎలాంటి సంబంధం లేదా? ఇలా పూర్తి స్థాయి విచారణకు సిద్ధమవుతున్నారు పోలీసులు. ఈ న్యూస్ స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
ఇవి కూడా చదవండి :
- కేటీఆర్ ఆ కుటుంబానికి ఆదుకోవాలి… రేవంత్ రెడ్డి డిమాండ్
- ఆంద్రప్రదేశ్ టూ తెలంగాణ… గంజాయి రవాణా చేస్తున్న ఉప సర్పంచ్ ముఠా అరెస్ట్
- 66 అడుగుల బావిలో పడిన వృద్ధురాలు.. క్షేమంగా రక్షించిన అగ్నిమాపక సిబ్బంది
- సోమేష్ కుమార్ వీఆర్ఎస్‌కి అప్లై చేయడం వెనుక కారణం… బీహార్ బీఆర్ఎస్ అధ్యక్షుడిగా పగ్గాలు..?
- ఆగని లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులు.. విజయవాడలో మరొకరు బలి