
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : సీపీఐ రాజకీయ పార్టీయని.. మఠం కాదని పార్టీ సీనియర్ నేత నారాయణ వ్యాఖ్యానించారు. పార్టీ అధికారంలోకి రావాలని తమకు ఉందని చెప్పారు. రేవంత్ రెడ్డి పార్టీకి మాకు వ్యతిగతంగా విబేధాలు లేవని చెప్పిన నారాయణ..కాంగ్రెస్ తో సీపీఐ కలుస్తుందనే వార్తల్లో నిజం లేదన్నారు. మోడీ ప్రభుత్వం ఆదానీ కోసం అనేక మందిపై ఐట..ఈడీ.., సీబీఐ దాడులు చేయిస్తోందని ఆరోపించారు. ముంబై ఎయిర్ పోర్ట్ అంశంలో జీవీకే కు అప్పు ఇవ్వలేదని చెప్పుకొచ్చిన నారాయణ..ఆదానీ కి మాత్రం రూ 13వేల కోట్లు మాఫీ చేసిందని నారాయణ ఆరోపించారు. ఆధాని మాయల ఫకీరు కంటే దారుణంగా తయారు అయ్యారని ఫైర్ అయ్యారు.
Read Also : ఆప్‌దే ఢిల్లీ మేయర్ పీఠం.. మేయర్ ఎన్నికల్లో ఆప్ అభ్యర్థి షెల్లీ విజయం
ప్రభుత్వ సంస్థల నుంచి మెజారిటీ ఇన్వెస్ట్మెంట్ లు ఆదాని సంస్థలకు ప్రభుత్వం బదిలీ చేసిందని నారాయణ చెప్పుకొచ్చారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు ప్రత్యర్థి రాజకీయ నాయకుల పైన ఉసి గొల్పుతున్నారని మండిపడ్డారు. ఆప్, బీఆర్ఎస్ నాయకుల పై దాడులు అందులో భాగంగా పేర్కొన్నారు. దేశం చాలా ప్రమాదకరమైన పరిస్థితిలో ఉందని ఆవేదన వ్యక్తం చేసారు. జాతీయ స్థాయిలో బీజేపీని వ్యతిరేకించే పార్టీలు, నేతలు కలవాలని నారాయణ సూచించారు. బీఆర్ఎస్ పార్టీ మొదట్లో బీజేపీతో కలిసి పనిచేసినా ఇప్పుడు వ్యతిరేకంగా ఉందని చెప్పుకొచ్చారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ పైన ఆరోపణలు చేసారు. తాను చాలా కాలంగా తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు చూస్తన్నారని..ఇటువంటి పరిస్థితులు ఎప్పుడూ లేవన్నారు.
Also Read : వ్యభిచార దందాలో ఎస్‌ఐ తల్లి, తమ్ముడు.. పోలీస్ శాఖలో కలకలం
రాజకీయ పార్టీలపైన దాడులు ప్రజాస్వామ్యంలో మంచిది కాదని హితవు పలికారు. లోకేష్ పాదయాత్ర చేస్తుంటే ఎందుకు ఆపుతున్నారని నారాయణ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి జగన్ దృష్టిలో చంద్రబాబు ముసలోడుగా పదే పదే చెబుతున్నారని.. అదే నిజమైతే ఆ ముసలోడు రోడ్ షో లను ఎందుకు అడ్డుకుంటున్నారని నారాయణ నిలదీసారు. వైఎస్ వివేకా మరణం పైనా నారాయణ కీలక వ్యాఖ్యలు చేసారు. జాతీయ స్థాయిలో తాము ఎవరితో కలుస్తా..ఏ అంశాల ప్రాతిపదికన కలవాలనే అంశం పైన చర్చించి నిర్ణయం తీసుకుంటామని నారాయణ చెప్పుకొచ్చారు.
ఇవి కూడా చదవండి :
- మురారీ సినిమా తరహాలో ఎన్టీఆర్ ఫ్యామిలీని శాపం వెంటాడుతోందా?
- కంటోన్మెంట్ ఉప ఎన్నికపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ… ఈ స్థానంపై యువనేతల ఫోకస్
- కేటీఆర్ ఆ కుటుంబానికి ఆదుకోవాలి… రేవంత్ రెడ్డి డిమాండ్
- ఆంద్రప్రదేశ్ టూ తెలంగాణ… గంజాయి రవాణా చేస్తున్న ఉప సర్పంచ్ ముఠా అరెస్ట్
- 66 అడుగుల బావిలో పడిన వృద్ధురాలు.. క్షేమంగా రక్షించిన అగ్నిమాపక సిబ్బంది
2 Comments