
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : తెలంగాణలోని కుక్కల దాడి ఘటనలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. విశ్వనగరంలో పాలన కుక్కలు బాలుడిపై దాడి చేసి చంపేవరకు వచ్చిందని విమర్శించారు. ‘బాలుడు కుటుంబాన్ని ఆదుకోకుండా సారీ చెప్పి చేతులు దులిపేసుకున్నారు. కుక్కలకు ఆకలి వేసి బాలుడిని తిన్నాయని మేయర్ అంటున్నారు. మంత్రి ఏమో కుక్కలకు కు.ని ఆపరేషన్ చేయిస్తామంటాడు. జరిగింది ఒకటైతే.. ప్రజాప్రతినిధులు చెబుతున్నది మరొకటి’ అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ‘చిన్నారిని కుక్కలు చంపిన ఘటనపై సారీ చెప్పడం సిగ్గుచేటు.
Read Also : సోమేష్ కుమార్ వీఆర్ఎస్‌కి అప్లై చేయడం వెనుక కారణం… బీహార్ బీఆర్ఎస్ అధ్యక్షుడిగా పగ్గాలు..?
బీఆర్ఎస్ పాలన.. కుక్కల పాలన.. మనుషులు చనిపోతే కుక్కలకు కు.ని ఆపరేషన్ ఏంటి? మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ విఫలమయ్యారు. అంబర్‌పేటలో వీధి కుక్కలకు బలై నాలుగేళ్ల బాలుడు చనిపోతే మానవత్వం లేకుండా ప్రభుత్వం వ్యహరిస్తోంది. రోడ్డు మీద కుక్కలు మనుషులను పీక్కు తినే పరిస్థితి కేసీఆర్ ప్రభుత్వంలో వచ్చింది. ప్రదీప్ కుటుంబానికి నష్టపరిహారం ప్రకటించాలి’ అని రేవంత్ రెడ్డి తెలిపారు. ‘ప్రదీప్ కుటుంబంపై కనీసం సానుభూతి కూడా ప్రభుత్వం చూపడం లేదు. సారీ చెప్పి చేతులు దులిపేసుకున్నారు. కేటీఆర్ ఆ కుటుంబానికి ఆదుకోవాలి’ అని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి :
- ఆంద్రప్రదేశ్ టూ తెలంగాణ… గంజాయి రవాణా చేస్తున్న ఉప సర్పంచ్ ముఠా అరెస్ట్
- 66 అడుగుల బావిలో పడిన వృద్ధురాలు.. క్షేమంగా రక్షించిన అగ్నిమాపక సిబ్బంది
- బీఆర్ఎస్ ప్రభుత్వ ఓటమిని ఆ దేవుడు కూడా కాపాడలేడు…ఈటల రాజేందర్
- ఖదీర్ ఖాన్ మృతిపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్నిఆదేశించిన హైకోర్ట్…
- ఆస్తుల సృష్టిలో తెలంగాణ ప్రభుత్వం అగ్రస్థానం….
One Comment