
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నాడు. కుటుంబ సమేతంగా తిరుపతికి విచ్చేసిన సూర్య.. మంగళవారం స్వామి వారి దర్శనం చేసుకున్నాడు. స్వామి వారి నైవేద్య విరామ సమయంలో సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నాడు. శ్రీవారి దర్శనం తర్వాత రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా.. ఆలయ అధికారులు పట్టు వస్త్రాలతో సూర్యను సత్కరించారు. అనంతరం సూర్యకుమార్ యాదవ్‌కు తీర్థప్రసాదాలు అందజేశారు. కాగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీ-2023 నేపథ్యంలో టీమిండియా టీ20 స్టార్ సూర్యకుమార్ యాదవ్.. ఆస్ట్రేలియాతో తొలి మ్యాచ్‌తో అంతర్జాతీయ టెస్టుల్లో అడుగుపెట్టాడు.
Read Also : ఖదీర్ ఖాన్ మృతిపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్నిఆదేశించిన హైకోర్ట్…
అయితే, నాగ్‌పూర్ మ్యాచ్‌లో విఫలం(8 పరుగులు మాత్రమే) కావడంతో.. రెండో టెస్టులో సూర్యను పక్కనపెట్టారు. ఇదిలా ఉంటే.. ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ విజృంభణతో ఢిల్లీలో జరిగిన రెండో టెస్టును కూడా రెండున్నర రోజుల్లోనే ముగించింది టీమిండియా. ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించి సిరీస్‌లో 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇక మార్చి 1 నుంచి ఇండోర్ వేదికగా టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్టు ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో ఆటగాళ్లకు విశ్రాంతి లభించింది. దీంతో చాలా మంది టీమిండియా ప్లేయర్లు స్వస్థలాలకు వెళ్లగా సూర్య కుటుంబంతో కలిసి ఇలా దైవ దర్శనం చేసుకోవడం విశేషం.
ఇవి కూడా చదవండి :
- ఆస్తుల సృష్టిలో తెలంగాణ ప్రభుత్వం అగ్రస్థానం….
- బాలుడిపై వీధి కుక్కల దాడి… మృతి
- ఇంకా ఎన్ని అబద్ధాలు చెబుతారు… ట్విట్టర్‌లో సెటైర్లు పేల్చిన మంత్రి కేటీఆర్
- హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికలు… మజ్లిస్‌కు బీఆర్ఎస్ మద్దతు
- రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుంది… జగ్గారెడ్డి
One Comment