
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ మరోసారి తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు. గత కొంతకాలంగా కేంద్ర ప్రభుత్వ విధానాలను తీవ్రస్థాయిలో విమర్శిస్తున్న ఆయన.. మరోసారి ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని ప్రధాని మోదీ ఆపారంటూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సోమవారం కర్ణాటకలోని ఉడిపిలో జరిగిన ఓ కార్యక్రమంలో కామెంట్స్ చేశారు. ఆ కామెంట్లపై మంత్రి కేటీఆర్ తనదైన శైలిలో ట్విట్టర్‌లో వ్యంగ్యస్త్రాలు సంధించారు.
Read Also : హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికలు… మజ్లిస్‌కు బీఆర్ఎస్ మద్దతు
బీజేపీ అధికారంలో ఉన్న మహారాష్ట్ర, కర్ణాటకల మధ్య నెలకొన్న బెలగావి సరిహద్దు వివాదాన్ని కూడా ప్రధాని మోదీ పరిష్కరించలేకపోయారు. కానీ రష్యా, ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపారట. ఆ విషయాన్ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా తప్పుడు ప్రచారం చేస్తున్నారు.’ అంటూ కేటీఆర్ మండిపడ్డారు. రష్యా – ఉక్రెయిన్ దేశాల మధ్య నెలకొన్న యుద్ధాన్ని ప్రధాని మోడీ ఆపారనేది అవాస్తవమని అన్నారు. ఆ విషయాన్ని వారి నేతృత్వంలోని విదేశాంగ మంత్రిత్వ శాఖనే వెల్లడించిందని కేటీఆర్ గుర్తు చేశారు. ‘ఇంకా ఇలాంటి ఫేక్ ముచ్చట్లు ఎన్ని చెబుతారు సార్’ అంటూ మంత్రి కేటీఆర్ ట్విట్టర్‌లో సెటైర్లు వేశారు.
ఇవి కూడా చదవండి :
- భార్య బాగోతం.. చెడు వ్యసనాలకు బానిసగా మారి, కట్టుకున్న భర్తనే
- కొండగట్టుకు కేంద్రం నుండి నిధులు తెస్తావా…. బండి సంజయ్ కు మంత్రి కొప్పుల సవాల్
- రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుంది… జగ్గారెడ్డి
- రేవంత్ రెడ్డిని కలసి మురిసిన చిన్నారులు… వర్దన్నపేట నియోజకవర్గంలో పాదయాత్ర
- బీఆర్ఎస్‌తో పొత్తుపై వెంకటరెడ్డి యూటర్న్… పొత్తు ఉండదంటూ మళ్లీ వ్యాఖ్యలు
One Comment