
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : తెలంగాణలో ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. హైదరాబాద్ స్థానిక సంస్థలతో పాటు మహబూబ్ నగర్ – రంగారెడ్డి- హైదరాబాద్ ఉపాధ్యాయ స్థానానికి ఈనెల 16న నోటిఫికేషన్ ఇచ్చింది. అన్ని పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మంగా తీసుకోగా.. అధికార బీఆర్ఎస్ మాత్రం హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకుంది. ఈ ఎన్నికకు మిత్రపక్షం ఎంఐఎంకు మద్దతు ఇవ్వనున్నట్లు బీఆర్ఎస్ ప్రకటించింది.
Read Also : భార్య బాగోతం.. చెడు వ్యసనాలకు బానిసగా మారి, కట్టుకున్న భర్తనే
గతంలో మాదిరిగానే ఈ సారి కూడా మజ్లిస్‌కు మద్దతు ఇస్తున్నట్లు సీఎం కేసిఆర్ ప్రకటించారు. గతంలో 2017లో ఈ రెండు స్థానాలకు ఎన్నికలు జరగ్గా.. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థి సయ్యద్ అమీనుల్ హసద్ జాఫ్రీకి, మహబాబ్ నగర్ – రంగారెడ్డి – హైద్రాబాద్ టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి PRTU- TS అభ్యర్థి కాటేపల్లి జనార్దన్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీ తన మద్దతును ప్రకటించింది. ఈసారి కూడా మజ్లి్స్ అభ్యర్థికి సీఎం కేసీఆర్ మద్దతు ప్రకటించగా.. ఇక మహబూబ్ నగర్ – రంగారెడ్డి – హైదరాబాద్ టీచర్ ఎమ్మెల్సీ స్థానంపై నిర్ణయం ప్రకటించాల్సి ఉంది.
Also Read : కొండగట్టుకు కేంద్రం నుండి నిధులు తెస్తావా…. బండి సంజయ్ కు మంత్రి కొప్పుల సవాల్
ప్రస్తుత హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి సయ్యద్ అమీనుల్ హసద్ జాఫ్రీ పదవీ కాలం మే 1న ముగియనుంది. మహబాబ్ నగర్ – రంగారెడ్డి – హైద్రాబాద్ టీచర్ ఎమ్మెల్సీగా కొనసాగుతున్న కాటేపల్లి జనార్దన్ రెడ్డి పదవీ కాలం మార్చి 29న ముగియనుంది. ఇక ఈ ఎన్నికలకు సంబంధించి ఫిబ్రవరి 16న నోటిఫికేషన్ విడుదలైంది. నామినేషన్లకు చివరి తేదీ ఫిబ్రవరి 23 కాగా.. ఫిబ్రవరి 24న నామినేషన్లను పరిశీలిస్తారు. ఫిబ్రవరి 27 వరకు నామినేషన్ల ఉపసంహరణకు ఎన్నికల సంఘం గడువిచ్చింది. మార్చి 13న పోలింగ్, మార్చి 16న ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ జరపనున్నట్లు ఈసీ షెడ్యూల్‌లో పేర్కొంది.
ఇవి కూడా చదవండి :
- రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుంది… జగ్గారెడ్డి
- భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై దాడి… కుర్చీలు, కర్రలు విసిరిన బీఆర్ఎస్ కార్యకర్తలు
- కేసీఅర్ పాలన పోవాలి.. వైఎస్సార్ సంక్షేమ పాలన రావాలి : పాదయాత్రలో వైఎస్ షర్మిల
- ఆర్‌ఎస్‌ఎస్‌తో టచ్‌లో సీఎం కేసీఆర్… సంచలన వ్యాఖ్యలు చేసిన కేఏ పాల్
One Comment