
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న కిడ్ని సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఆదివారం ఆసుపత్రిలో కన్నుమూసిన సంగతి తెలిసిందే. నిన్న (సోమవారం) ఆయన అంతిమ సంస్కారాలు పూర్తి కాగా.. ఆయన అంత్యక్రియలపై పెద్ద ఎత్తున దుమారం రేగింది. 30 ఏళ్ల రాజకీయ అనుభవం 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సాయన్న అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో జరపకపోవటంపై అయన అభిమానులు, దళిత సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేశాయి. సాయన్న దళితుడు కాబట్టే అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరపటం లేదని.., సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసిఆర్ దళిత వ్యతిరేకి అంటూ దళిత సంఘాలు నిరసన చేపట్టాయి.
Read Also : తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్….
దీంతో సోమవారం అంత్యక్రియలకు హాజరైన మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి అక్కడి నుంచి వెళ్లిపోయారు. శాసనసభ డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, ఎమ్మెల్యేలు మైనంపల్లి హన్మంతరావు, మాగంటి గోపినాథ్ వారికి నచ్చజెప్పటంతో హైడ్రామా మధ్య అంత్యక్రియలు పూర్తయ్యాయి. తాజాగా ఈ పరిణామంపై బీజేపీ నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్పందించారు. సాయన్న అంత్యక్రియలు అధికారికంగా నిర్వహించకపోవటం సీఎం కేసీఆర్ అహంకారానికి నిదర్శనమని ఆయన మండిపడ్డారు. కేసీఆర్ ఫ్యూడల్ మనస్తత్వంతో వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఖాయమని.., బీఆర్ఎస్ ప్రభుత్వ ఓటమిని ఆ దేవుడు కూడా కాపాడలేడని అన్నారు. సీఎం కేసీఆర్ అన్ని వర్గాలను మోసగిస్తున్నారని ఈటల ధ్వజమెత్తారు.
Also Read : ఖదీర్ ఖాన్ మృతిపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్నిఆదేశించిన హైకోర్ట్…
దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని చెప్పి..,ఏడేళ్లలో ఒక్క ఎకరం భూమి కూడా ఇవ్వకుండా మోసగించారని ధ్వజమెత్తారు. ధరణీ పేరిట పేదలను ముంచారని.., సన్న, చిన్నకారు రైతులను బిక్షగాళ్లుగా మారుస్తున్నారని ఈటల ఫైర్ అయ్యారు. 2018 నుంచి ఇప్పటి వరకు మహిళా సంఘాలకు రావాల్సిన బకాయిలు ఎందుకు ఇవ్వటం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో 30 లక్షల మంది రైతులు బ్యాంకులకు ఎగరవేతదారులుగా మారటానికి సీఎం కేసీఆరే కారణమన్నారు. వచ్చే ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెబుతామని.., ప్రజలు కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు.
ఇవి కూడా చదవండి :
- ఆస్తుల సృష్టిలో తెలంగాణ ప్రభుత్వం అగ్రస్థానం….
- బాలుడిపై వీధి కుక్కల దాడి… మృతి
- ఇంకా ఎన్ని అబద్ధాలు చెబుతారు… ట్విట్టర్‌లో సెటైర్లు పేల్చిన మంత్రి కేటీఆర్
- హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికలు… మజ్లిస్‌కు బీఆర్ఎస్ మద్దతు
- భార్య బాగోతం.. చెడు వ్యసనాలకు బానిసగా మారి, కట్టుకున్న భర్తనే
One Comment