
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు పుట్టినరోజు సందర్బంగా ఆయనకు దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతున్నారు. కేసీఆర్‌కు సంపూర్ణ ఆరోగ్యంతో దీర్ఘాయుష్షు కలగాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. తెలంగాణ ముఖ్యమంత్రికి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ ఆయన ట్వీట్ చేశారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ కూడా ముఖ్యమంత్రి కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
Also Read : స్వాప్నికుడు.. ఉద్యమకారుడు… పరిపాలనదక్షుడు..సిఎం కేసీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు
‘మీకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుణ్ని ప్రార్థిస్తున్నాను’ అంటూ ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆస్ట్రేలియాలోని పలు నగరాల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ పుట్టినరోజు వేడుకలను ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు. సిడ్నీ, అడిలైడ్, మెల్‌బోర్న్, కాన్‌బెర్రా, బ్రిస్బేన్, గోల్డ్‌కోస్ట్, బెండీగో నగరాల్లో బీఆర్‌ఎస్ ఆస్ట్రేలియా శాఖ అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కేసీఆర్ పుట్టినరోజు వేడుకలను గురువారం నిర్వహించారు. అక్కడి ఆలయాల్లో సీఎం కేసీఆర్ పేరిట ప్రత్యేక పూజలు నిర్వహించారు. అన్నదానం, వస్త్రదానం, మొక్కలు నాటడం లాంటి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.
ఇవి కూడా చదవండి :
- రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుంది… జగ్గారెడ్డి
- భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై దాడి… కుర్చీలు, కర్రలు విసిరిన బీఆర్ఎస్ కార్యకర్తలు
- రేవంత్ రెడ్డిని కలసి మురిసిన చిన్నారులు… వర్దన్నపేట నియోజకవర్గంలో పాదయాత్ర
- సిఎం కేసిఆర్ సొంత నియోజకవర్గంలో పర్యటించిన పంజాబ్ సిఎం… సాగునీటి ప్రాజెక్ట్ ల పరిశీలన
- ఆర్‌ఎస్‌ఎస్‌తో టచ్‌లో సీఎం కేసీఆర్… సంచలన వ్యాఖ్యలు చేసిన కేఏ పాల్
One Comment