
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కెసిఆర్ కొండగట్టు పర్యటన పై చేసిన వ్యాఖ్యలకు మంత్రి కొప్పుల ఈశ్వర్ కౌంటర్ ఇచ్చారు. రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ బండి సంజయ్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రాజకీయ వ్యవస్థకు కళంకంగా మారాడని, 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఇటువంటి దుర్మార్గమైన రాజకీయ నాయకులను ఎవరిని తాను చూడలేదని ఆయన వ్యాఖ్యానించారు. బండి సంజయ్ రాజకీయాల్లో నీచాతి నీచమైన పద్ధతులకు, దుర్మార్గాలకు తెరలేపాడని అసహనం వ్యక్తం చేశారు.
Read Also : సిఎం కేసిఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోధీ, బండి సంజయ్
రాజకీయ వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నాడని, కలుషితం చేస్తున్నాడని బండి సంజయ్ పై కొప్పుల ఈశ్వర్ నిప్పులు చెరిగారు. సీఎం కేసీఆర్ కొండగట్టు పుణ్యక్షేత్రాన్ని పరిశీలించి, దాని అభివృద్ధికి అవసరమైతే 1000 కోట్లయినా మంజూరు చేస్తానని ప్రకటిస్తే ఈ విషయం పైన కూడా బండి సంజయ్ నీచంగా మాట్లాడడం అత్యంత అసహ్యంగా ఉందని కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. దేవుడి పేరుతో రాజకీయాలు చేసే బండి సంజయ్ రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధికి కేంద్రం నుంచి ఒక్క రూపాయి అయినా తీసుకొచ్చారా? అంటూ ప్రశ్నించారు. రాజకీయాలు అంటే విలువలతో కూడినవని, బండి సంజయ్ నోటికి ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడుతూ రాజకీయాలు చెయ్యటం సిగ్గుచేటని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. కొండగట్టు అంజన్న భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడిన బండి సంజయ్ బేషరతుగా భక్తులకు క్షమాపణలు చెప్పాలని కొప్పుల ఈశ్వర్ డిమాండ్ చేశారు. దమ్ముంటే కొండగట్టు అభివృద్ధికి కేంద్రం నుంచి నిధులు తీసుకురావాలని సవాల్ విసిరారు.
Also Read : స్వాప్నికుడు.. ఉద్యమకారుడు… పరిపాలనదక్షుడు..సిఎం కేసీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు
ఇక చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ కూడా బండి సంజయ్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కు దమ్ముంటే కొండగట్టు ఆలయ అభివృద్ధికి ఏం చేస్తారో 24 గంటల్లోగా చెప్పాలని ఆయన చాలెంజ్ చేశారు. ఒకవేళ స్పందించకపోతే హిందూ బిడ్డలందరూ కలిసి బండి సంజయ్ ను తరిమికొట్టాలంటూ పిలుపునిచ్చారు. రెండువేల కోట్ల రూపాయలతో యాదాద్రిని అభివృద్ధి చేయడం, కొండగట్టును దేశంలోనే అద్భుతమైన హనుమాన్ క్షేత్రంగా తీర్చిదిద్దాలనుకోవడం దేవుళ్లను మోసం చేయడం ఎలా అవుతుంది అంటూ ప్రశ్నించారు. మతం పేరుతో, దేవుళ్ళ పేరుతో రాజకీయాలు చేసేది బండి సంజయ్ మాత్రమేనని వారు అసహనం వ్యక్తం చేశారు. కనీసం బండి సంజయ్ తన నియోజకవర్గంలో ఏ దేవాలయ అభివృద్ధికి ఎన్ని నిధులు ఇచ్చారో? ఎన్ని నిధులు తెచ్చారో? చెప్పాలని ప్రశ్నించారు. కొండగట్టుపై ఇన్ని మాటలు మాట్లాడుతున్న బండి సంజయ్ కొండగట్టుకు ఏం చేస్తారో చెప్పాలంటూ నిలదీశారు.
ఇవి కూడా చదవండి :
- రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుంది… జగ్గారెడ్డి
- భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై దాడి… కుర్చీలు, కర్రలు విసిరిన బీఆర్ఎస్ కార్యకర్తలు
- రేవంత్ రెడ్డిని కలసి మురిసిన చిన్నారులు… వర్దన్నపేట నియోజకవర్గంలో పాదయాత్ర
- సిఎం కేసిఆర్ సొంత నియోజకవర్గంలో పర్యటించిన పంజాబ్ సిఎం… సాగునీటి ప్రాజెక్ట్ ల పరిశీలన
- కేసీఅర్ పాలన పోవాలి.. వైఎస్సార్ సంక్షేమ పాలన రావాలి : పాదయాత్రలో వైఎస్ షర్మిల