
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : కాంగ్రెస్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై దాడి జరిగింది. నల్గొండ జిల్లా శాలి గౌరారం మండలం ఇటుకలపాడు గ్రామంలో నిర్వహించిన బొడ్రాయి పండుగకు హాజరైన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై బీఆర్ఎస్ కార్యక్రర్తలు దాడికి యత్నించారు. కోమటిరెడ్డి పైకి కర్రలు, కుర్చీలు, ఇతర వస్తువులు విసిరారు. దీంతో అక్కడ గందరగోళ వాతవరణం నెలకొంది . కోమటిరెడ్డిపై దాడికి యత్నించటంతో.. బీఆర్ఎస్ నేతలపైకి కాంగ్రెస్ నేతలు తిరగబడ్డారు. ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో ఇటుకలపాడు గ్రామంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది.
Read Also : రేవంత్ రెడ్డిని కలసి మురిసిన చిన్నారులు… వర్దన్నపేట నియోజకవర్గంలో పాదయాత్ర
అయితే.. బొడ్రాయి పండుగలో పాల్గొన్న కోమటిరెడ్డి కేసీఆర్ సర్కార్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఇటుకలపాడు గ్రామానికి వచ్చే రోడ్డు బాగోలేదని.. గ్రామానికి చేరుకోడానికి సుమారు 3 గంటల సమయం పట్టిందని విమర్శలు గుప్పించారు. కేవలం కోటి రూపాయలు పెడితే రోడ్డు వేయొచ్చన్నారు. ప్రగతిభవన్, కొత్త సెక్రటేరియట్లు కట్టొచ్చు కానీ.. రోడ్డు వేయటానికి చేతులు రావట్లేదని మండిపడ్డారు. దీంతో.. కోమటిరెడ్డి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే వెంకట్ రెడ్డిపైకి కర్రలు, కుర్చీలు విసిరారు. దీంతో.. వెంటనే కోమటిరెడ్డిని కార్యకర్తలు అక్కడి నుంచి వెళ్లిపోయారు.
Also Read : సిఎం కేసిఆర్ సొంత నియోజకవర్గంలో పర్యటించిన పంజాబ్ సిఎం… సాగునీటి ప్రాజెక్ట్ ల పరిశీలన
కాగా.. ఈ ఘర్షణ విషయం తెలిసి రంగ ప్రవేశం చేసిన పోలీసులు.. ఇరువర్గాలను నివారించి అక్కడి నుంచి చెదరగొట్టారు. బీఆర్ఎస్ కార్యకర్తలు విరిసిన వస్తువులు.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి తగలకపోవటంతో ఎలాంటి గాయాలు కాలేదు. అయితే.. ఈ దాడిలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఎలాంటి గాయాలు కాకపోవటంతో.. ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు.. బీఆర్ఎస్ కార్యకర్తల తీరుపై కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రాజకీయం అన్నాక.. విమర్శలు సాధారణమని.. ఇలా దాడులు చేస్తూ రౌడీయిజం ప్రదర్శిచటం.. ప్రభుత్వ అహంకారానికి నిదర్శనమంటూ మండిపడుతున్నారు.
ఇవి కూడా చదవండి :
- కేసీఅర్ పాలన పోవాలి.. వైఎస్సార్ సంక్షేమ పాలన రావాలి : పాదయాత్రలో వైఎస్ షర్మిల
- ఆర్‌ఎస్‌ఎస్‌తో టచ్‌లో సీఎం కేసీఆర్… సంచలన వ్యాఖ్యలు చేసిన కేఏ పాల్
- బీజేపీ పార్టీ కి రాజీనామా చేసిన కొప్పుల జగన్ గౌడ్..
- ఆకుల శ్రీవాణిని సన్మానించిన కిరణ్ రాజ్(GKR)
- చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం వద్ద ఘోర రోడ్డుప్రమాదం.. నలుగురి మృతి
2 Comments