
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : తెలంగాణ ప్రజలు కేసీఆర్ ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్నారని.. కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని కాంగ్రెస్ సీనియర్ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్ రావు థాక్రేను కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇంఛార్జీగా థాక్రే బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలిసారి కలిశానన్నారు. థాక్రేతో అనేక రాజకీయ అంశాలపై చర్చించినట్లు జగ్గారెడ్డి తెలిపారు. బీఆర్ఎస్, బీజేపీని ఏ విధంగా ఎదుర్కోవాలనే అంశంపై చర్చించినట్లు వెల్లడించారు. పార్టీలోని అంతర్గత విషయాలపై చర్చ జరగలేదన్నారు. థాక్రే అనుభవం తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడుతుందన్నారు.
Read Also : భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై దాడి… కుర్చీలు, కర్రలు విసిరిన బీఆర్ఎస్ కార్యకర్తలు
రాష్ట్రంలోని 70 స్థానాల్లో విజయం కోసం పనిచేస్తామన్నారు. కాంగ్రెస్ బలం, బలహీనతను థాక్రేకు వివరించినట్లు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందన్నారు. తాను కూడా పాదయాత్రను ప్రారంభిస్తానని, రూట్ మ్యాప్ ను త్వరలో తెలియజేస్తానన్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాటలను వక్రీకరించారన్నారు జగ్గారెడ్డి. ఆయన చెప్పింది ఒకటైతే.. మీడియాలో వచ్చింది మరొకటని చెప్పారు. ప్రజలకు అది మరోలా అర్థమైందన్నారు. పొత్తులపై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో పార్టీకి ఎలాంటి నష్టం జరగలేదని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. ఎవరేం మాట్లాడినా కాంగ్రెస్ పార్టీకి నష్టం జరగదన్నారు. కోమటిరెడ్డి వెంకట రెడ్డి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని, ఆ వ్యాఖ్యలతో కార్యకర్తలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
Also Read : రేవంత్ రెడ్డిని కలసి మురిసిన చిన్నారులు… వర్దన్నపేట నియోజకవర్గంలో పాదయాత్ర
ఏఐసీసీ ప్రోగ్రామ్స్ కమిటీ ఛైర్మన్ మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. మాణిక్ రావు థాక్రేతో పాదయాత్రలపై చర్చించినట్లు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోపైనా చర్చిచంచినట్లు చెప్పారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ సిద్ధాంతాన్ని నమ్మిన నాయకుడని అన్నారు. ఇప్పటికే ఆయనతో మాణిక్ రావు థాక్రేతో మాట్లాడారని చెప్పారు. ఫిబ్రవరి 28న కోమటిరెడ్డి, మార్చి 1న ఉత్తమ్ కుమార్ రెడ్డి, 2న భట్టి విక్రమార్క్ పాదయాత్రలు చేస్తారని తెలిపారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితోపాటు ఉత్తమ్, కోమటిరెడ్డి తోపాటు తాను కూడా పాదయాత్ర చేస్తానన్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్ త్వరలో ప్రకటిస్తామన్నారు. మార్చి మొదటివారంలో పాదయాత్ర చేయాలని ఆలోచిస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో అందరూ కలిసే ఉన్నారని.. నాయకుల మధ్య అభిప్రాయ భేదాలే తప్ప విభేదాల్లేనవి మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి తెలిపారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీదే గెలుపు అని వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి :
- సిఎం కేసిఆర్ సొంత నియోజకవర్గంలో పర్యటించిన పంజాబ్ సిఎం… సాగునీటి ప్రాజెక్ట్ ల పరిశీలన
- కేసీఅర్ పాలన పోవాలి.. వైఎస్సార్ సంక్షేమ పాలన రావాలి : పాదయాత్రలో వైఎస్ షర్మిల
- ఆర్‌ఎస్‌ఎస్‌తో టచ్‌లో సీఎం కేసీఆర్… సంచలన వ్యాఖ్యలు చేసిన కేఏ పాల్
- చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం వద్ద ఘోర రోడ్డుప్రమాదం.. నలుగురి మృతి
- బీజేపీ పార్టీ కి రాజీనామా చేసిన కొప్పుల జగన్ గౌడ్..
2 Comments