
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : పంజాబ్ సీఎం భగవంత్ మాన్ నేడు తెలంగాణ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. తెలంగాణ సీఎం సొంత నియోజకవర్గం అయిన సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో సాగునీటి ప్రాజెక్టుల అభివృద్ధిని ఆయన పరిశీలించారు. హైదరాబాద్ నుండి గజ్వేల్ కి వెళ్ళిన పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ కొండపోచమ్మ రిజర్వాయర్ ను పరిశీలించారు. మల్లన్న సాగర్, మర్ముక్ పంప్ హౌస్, పాండవుల చెరువులను కూడా ఆయన పరిశీలించనున్నారు. ఇప్పటికే అనేక మార్లు తెలంగాణాలో పర్యటించిన పంజాబ్ సీఎం భగవంత్ మాన్ మళ్ళీ ఇప్పుడు తెలంగాణా సాగునీటి ప్రాజెక్ట్ లపై అధ్యయనం చేస్తున్నారు.
Read Also : కేసీఅర్ పాలన పోవాలి.. వైఎస్సార్ సంక్షేమ పాలన రావాలి : పాదయాత్రలో వైఎస్ షర్మిల
తెలంగాణ రాష్ట్రంలో నిర్మించిన సాగునీటి ప్రాజెక్టుల అభివృద్ధిని పరిశీలించేందుకు వచ్చిన పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ ఈరోజు సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్ట్ ను సందర్శించారు. మొదటగా కొండపోచమ్మ సాగర్ పంప్ హౌస్ ను పరిశీలించి.. ప్రాజెక్టు యొక్క వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం గురించి.. ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన రిజర్వాయర్ ల గురించి సీఎం భగవంత్ మాన్ కు వివరించారు. కాళేశ్వరం నుండి 618 మీటర్ల ఎత్తులో కొండపోచమ్మ సాగర్ ఉందని, 15 టిఎంసిల సామర్థ్యంతో ఈ రిజర్వాయర్ని ప్రభుత్వం నిర్మించిందని రజత్ కుమార్ పంజాబ్ సీఎంకు వివరించారు.
Also Read : ఆర్‌ఎస్‌ఎస్‌తో టచ్‌లో సీఎం కేసీఆర్… సంచలన వ్యాఖ్యలు చేసిన కేఏ పాల్
ఇది 2,85,280 ఎకరాలకు సాగునీటిని అందిస్తుందని ఆయన తెలిపారు. అనంతరం ఎర్రవెల్లి- నరసన్నపేట గ్రామాల మధ్యలో ఉన్న ఎర్రవెల్లి చెక్ డ్యాంను పంజాబ్ సీఎం పరిశీలించారు. భూగర్భ జలాలను కాపాడడం కోసం గత కొన్ని సంవత్సరాలుగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అనేక పనులను పంజాబ్ సీఎం భగవంత్ మాన్ బృందం పరిశీలిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో చేసిన మిషన్ కాకతీయ కింద చెరువుల పునరుద్ధరణ, చెక్ డ్యాం ల నిర్మాణ పనులను అధ్యయనం చేయనున్నారు. తెలంగాణ రాష్ట్రంలో భూగర్భ జలాల పరిరక్షణకు తీసుకున్న అనేక చర్యలను నిశితంగా పరిశీలించి అనంతరం తిరిగి హైదరాబాద్ కు చేరుకుంటారు.
ఇవి కూడా చదవండి :
- చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం వద్ద ఘోర రోడ్డుప్రమాదం.. నలుగురి మృతి
- మెదక్ జిల్లా నార్సింగిలో విషాదం… చెరువులోకి దూకి ప్రేమ జంట ఆత్మహత్య
- బీఆర్ఎస్‌తో పొత్తుపై వెంకటరెడ్డి యూటర్న్… పొత్తు ఉండదంటూ మళ్లీ వ్యాఖ్యలు
- ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి పెద్ద రౌడీ…. జీవిత రాజశేఖర్ సంచలన వ్యాఖ్యలు
- గిరిజన ద్రోహి సీఎం కేసీఆర్…. ముఖ్యమంత్రిపై బండి సంజయ్ ఫైర్
2 Comments