Telangana

రేవంత్ రెడ్డిని కలసి మురిసిన చిన్నారులు… వర్దన్నపేట నియోజకవర్గంలో పాదయాత్ర

క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్రకు నేడు 10వ రోజుకి చేరుకుంది. బుధవారం పాలకూర్తి నియోజకవర్గంలో జరగ్గా.. ఇవాళ వర్ధన్నపేట నియోజకవర్గంలో రేవంత్ పాదయాత్ర కొనసాగుతోంది. ఈ పాదయాత్రకు కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజలు భారీగా తరలివస్తున్నారు. రేవంత్‌ను కలిసేందుకు చాలామంది ఆసక్తి చూపుతున్నారు. ప్రజలను కలుసుకుని వారి సమస్యలను రేవంత్ తెలుసుకుంటూ ముందుకు కదులుతున్నారు. అయితే రేవంత్ పాదయాత్రలో చిన్నారులు సందడి చేశారు.

Read Also : సి‌ఎం కే‌సి‌ఆర్ సొంత నియోజకవర్గంలో పర్యటించిన పంజాబ్ సి‌ఎం… సాగునీటి ప్రాజెక్ట్ ల పరిశీలన

రేవంత్‌ను కలిసేందుకు పాదయాత్రలో పరుగులు పెట్టారు. ఒక కిలోమీటర్ నడిచి చివరికి రేవంత్‌ను కలిశారు. పాదయాత్రలో రేవంత్‌ని కలిసి మురిసిపోయారు. చిన్నారులను పలకరించిన రేవంత్.. వారిని ఆశీర్వదించారు. దీనికి సంబంధించిన వీడియోను రేవంత్ తన ట్విట్టర్‌లో షేర్ చేశారు. ‘ఈ పిల్లలు నన్ను కలవడానికి 1 కి.మీ కంటే ఎక్కువ పరిగెత్తారు. వారి విషెస్ నా హృదయాన్ని ఆనందంతో, కృతజ్ఞతతో నింపాయి. వారి ఉజ్వల భవిష్యత్తు కోసం కాంగ్రెస్ కృషి చేస్తుంది’ అని రేవంత్ ట్వీట్ చేశారు.

Also Read : కేసీఅర్ పాలన పోవాలి.. వైఎస్సార్ సంక్షేమ పాలన రావాలి : పాదయాత్రలో వైఎస్ షర్మిల

ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పాదయాత్రలో భాగంగా ఉప్పర్ పల్లికి చెందిన సందీప్ అనే గొర్రెల కాపరి రేవంత్‌ను కలిసి సమస్యలు చెప్పుకున్నారు. గొర్రెల యూనిట్లు ఇస్తామని డబ్బులు తీసుకుని గొర్రెల పంపిణీ చేయలేదని సందీప్ ఆవేదన వ్యక్తం చేశాడు. రెండు యూనిట్ల కోసం రూ.86 వేలు కట్టించుకుని ఇప్పటికీ గొర్రెలు పంపిణీ చేయలేదని ఆవేదన చెందాడు. ఆ తర్వాత మొక్కజొన్న తోటలో రేవంత్ కోత మిషన్ నడపడం అందరినీ ఆశ్చర్యపరిచింది. పోలంలోకి వెళ్లిన రేవంత్.. కోత మిషన్ నడిపారు.

ఇవి కూడా చదవండి : 

  1. బీజేపీ పార్టీ కి రాజీనామా చేసిన కొప్పుల జగన్ గౌడ్..
  2. ఆర్‌ఎస్‌ఎస్‌తో టచ్‌లో సీఎం కేసీఆర్… సంచలన వ్యాఖ్యలు చేసిన కేఏ పాల్
  3. చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం వద్ద ఘోర రోడ్డుప్రమాదం.. నలుగురి మృతి
  4. మెదక్ జిల్లా నార్సింగిలో విషాదం… చెరువులోకి దూకి ప్రేమ జంట ఆత్మహత్య
  5. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి దూరంగా బీఆర్ఎస్ ?

ad 728x120 SRI copy - Crime Mirror

Show More

Crime Mirror

Crime Mirror - Telugu Daily News Paper operating from Hyderabad, Telangana.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WP2Social Auto Publish Powered By : XYZScripts.com

Adblock Detected

We have detected ad blocker on your browser, please add it to execution or add to white list, to support us.