
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్‌ఎస్‌ఎస్‌తో కేసిఆర్ టచ్‌లో ఉన్నారని ఆరోపించారు. యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయం తరహాలో కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది. అందులో భాగంగా కొండగట్టు అభివృద్ధి కోసం కేసీఆర్ రూ.500 కోట్ల నిధులు విడుదల చేశారు. కొండగట్టు ఆలయానికి నిధులు కేటాయించడంపై కేఏ పాల్ సీరియస్ అయ్యారు.
Read Also : చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం వద్ద ఘోర రోడ్డుప్రమాదం.. నలుగురి మృతి
దీనిపై హైకోర్టును ఆశ్రయించనున్నట్లు స్పష్టం చేశారు. కోర్టులు మొట్టికాయలు వేసినా కేసీఆర్ మారడం లేదని విమర్శించారు. కొండగట్టు అభివృద్ధి కోసం ప్రజల సొమ్ము ఎందుకు ఖర్చు చేస్తున్నారని ప్రశ్నించారు. ఆర్ఎస్‌ఎస్ అజెండాను కేసీఆర్ అమలు చేస్తున్నారని, ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో తన కూతురు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ కాకుండా తప్పించడానికేనా? అంటూ కేఏ పాల్ ప్రశ్నించారు. బీజేపీ బీ టీమ్‌గా కేసీఆర్ మారారని, అందుకే కేసీఆర్, కేటీఆర్ అరెస్ట్ కావడం లేదని కేఏ పాల్ ఆరోపించారు.
Also Read : మెదక్ జిల్లా నార్సింగిలో విషాదం… చెరువులోకి దూకి ప్రేమ జంట ఆత్మహత్య
తమది సెక్యూలర్ పార్టీ అని చెప్పుకుంటున్న కేసీఆర్.. చర్చిలకు, మసీదులకు ఎందుకు నిధులు ఇవ్వడం లేదని నిలదీశారు. తాను నిజమైన హిందూవునని, కానీ ఏసుక్రీస్తును ఫాలో అవుతానని చెప్పారు. హిందూవుగానే తాను చనిపోతానని తెలిపారు. ప్రభుత్వ భూములను అమ్మి దేవాలయాలకు కేసీఆర్ నిధులు ఇస్తున్నారన్నారు. సెక్యూలర్ ప్రజలు దీనిపై కేసీఆర్‌ను ప్రశ్నిస్తున్నారని, దీనికి సమాధానం చెప్పారని అన్నారు.
ఇవి కూడా చదవండి :
- చంద్రబాబు పర్యటనలో అపశృతి.. తృటిలో తప్పిన ప్రమాదం
- బీఆర్ఎస్‌తో పొత్తుపై వెంకటరెడ్డి యూటర్న్… పొత్తు ఉండదంటూ మళ్లీ వ్యాఖ్యలు
- ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి పెద్ద రౌడీ…. జీవిత రాజశేఖర్ సంచలన వ్యాఖ్యలు
- నీరా తాగిన వైఎస్ షర్మిల… కల్లు గీత కార్మికుల సమస్యలపై ఆరా
- గిరిజన ద్రోహి సీఎం కేసీఆర్…. ముఖ్యమంత్రిపై బండి సంజయ్ ఫైర్
One Comment