
క్రైమ్ మిర్రర్, సరూర్ నగర్ : గ్రేటర్ హైద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధిగా నూతనంగా భాద్యతలు స్వీకరించిన మహేశ్వరం నియోజకవర్గ ముద్దుబిడ్డ, సరూర్ నగర్ డివిజన్ కార్పోరేటర్ ఆకుల శ్రీవాణిఅంజన్ ని గురువారం నాడు సరూర్ నగర్ డివిజన్ భారతీయ జనతా పార్టీ జనరల్ సెక్రటరీ గంటి కిరణ్ రాజ్ (GKR) మర్యాదపూర్వకంగా కలసి, శాలువాతో సత్కరించి, శుభాకాంక్షలు తెలియచేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ శ్రీవాణిఅంజన్ ఇలాంటి ఎన్నో కీలక భాద్యతలు నిర్వహిస్తు ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆశాభావం వ్యక్తం చేశారు.