
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల నగరా మోగింది. మహబాబ్ నగర్ – రంగారెడ్డి – హైద్రాబాద్ టీచర్ ఎమ్మెల్సీ స్థానంతో పాటు హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీకి ఖాళీలు ఏర్పడంతో కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) షెడ్యూల్ విడుదల చేసింది. ఈ రెండు స్థానాలకు రేపు నోటిఫికేషన్ విడుదల కానుంది. తెలంగాణలో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో అన్ని పార్టీలు ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ఈ ఎన్నికల్లో సత్తాచాటి తమ బలమేంటో చూపించాలని అన్ని పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో పోటీకి అధికార బీఆర్ఎస్ దూరంగా ఉండాలని భావిస్తున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం.
Read Also : ఆయనతో టచ్ లో ముగ్గురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు!
టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మార్చి ఆ పార్టీ అధినేత, సీఎం కేసిఆర్ జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. స్థానిక పార్టీని జాతీయ పార్టీగా మార్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీకి రాష్ట్రంలో ఇవే మెుదటి ఎన్నికలు. అయితే ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆ పార్టీ సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆ పార్టీ అధికారికంగా ధృవీకరించనప్పటికీ పోటీకి దూరంగా ఉండాలని కేసీఆర్ భావిస్తున్నట్లు ఉహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ రెండు స్థానాలుకు 2017లో ఎన్నికలు జరగ్గా.. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల్లో మజ్లిస్ అభ్యర్థి సయ్యద్ అమీనుల్ హసద్ జాఫ్రీకి, మహబాబ్ నగర్ – రంగారెడ్డి – హైద్రాబాద్ టీచర్ ఎమ్మెల్సీ స్థానానికిగానూ పీఆర్టీయూ- టీఎస్ అభ్యర్థి కాటేపల్లి జనార్దన్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇచ్చింది. ఈసారి కూడా మజ్లి్స్ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం. ఉపాధ్యాయ నియోజవర్గానికి అభ్యర్థిని నిలిపే అవకాశం ఉన్నప్పటికీ గతంలో అనుసరించిన రాజకీయ విధానాన్నే అనుసరించాలని బీఆర్ఎస్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read : కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బీఆర్‌ఎస్‌తో పొత్తు వ్యాఖ్యలు… సొంత పార్టీలోనే దుమారం
హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి సయ్యద్ అమీనుల్ హసద్ జాఫ్రీ పదవీ కాలం మే 1న ముగియనుండగా.. మహబాబ్ నగర్ – రంగారెడ్డి – హైద్రాబాద్ టీచర్ ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్దన్ రెడ్డి పదవీ కాలం మార్చి 29న ముగియనుంది. ఇక రేపు (ఫిబ్రవరి 16న) ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్లకు చివరి తేదీ ఫిబ్రవరి 23. నామినేషన్లను ఫిబ్రవరి 24న పరిశీలిస్తారు. ఫిబ్రవరి 27 వరకు నామినేషన్ల ఉపసంహరణకు ఎన్నికల సంఘం గడువిచ్చింది. మార్చి 13న పోలింగ్ జరగనుండగా.. మార్చి 16న ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ జరపనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌లో పేర్కొంది.
ఇవి కూడా చదవండి :
- ట్యూషన్ తో పాటు సెక్స్ పాఠాలు చెబుతున్న హెడ్ మాస్టర్
- వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి పోటీ… కోమటిరెడ్డి వ్యాఖ్యలపై బండి సంజయ్ కౌంటర్
- నూతన సచివాలయ ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్…. అంబేద్కర్ జయంతి రోజున ప్రారంభం
- మహబూబ్ నగర్ టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ….
- ఈటల కోసం కేసీఆర్ విశ్వప్రయత్నం… ట్విట్టర్ వేదికగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
2 Comments