
క్రైమ్ మిర్రర్, నల్లగొండ నిఘా ప్రతినిధి : పేదలే కాదు వారికి అందించే ఆహార పదార్దాలలో కూడా ప్రభుత్వం వ్యత్యాసం చూపిస్తుందనే పదానికి ఏమాత్రం తేడా లేకుండా వ్యవహారిస్తున్నారు సివిల్ సప్లై అధికారులు. ప్రతి మనిషి కష్టం చేసేది జానెడు పొట్ట కోసమేనన్న విషయం ప్రభుత్వం, ప్రభుత్వ అధికారులు ఎందుకు గుర్తించటం లేదని సర్వత్రా విమర్శలు వినపడుతున్నాయి. ఇక వివరాలలోకి వెళ్తే జిల్లాలోని మర్రిగూడ మండలం వట్టిపల్లి గ్రామం రేషన్ షాప్ నందు నిర్లక్ష్యం విలయతాండవం చేస్తుంది. గత రెండు నెలల క్రితం ముక్కపట్టి, పురుగులు పట్టి, తుట్టెలు కట్టిన రేషన్ బియ్యం బస్తాలు రావటంతో, రేషన్ డీలర్ సంబంధిత శాఖ అధికారులకు సమాచారం అందించి బస్తాలు తిరిగి తీసుకెళ్లవలసిందిగా కోరారని సమాచారం.
Read Also : ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి దూరంగా బీఆర్ఎస్ ?
మొదట సరే అని చెప్పిన అధికారులు రెండు నెలలు గడుస్తున్నప్పటికి తిరిగి పాడైపోయిన బస్తాలు తీసుకెళ్లకపోవటంతో స్థానికులు అడిగే ప్రశ్నలకు డీలర్ సమాధానం చెప్పలేకపోతున్నాడని లబ్ధిదారులు అంటున్నారు. పేద ప్రజల కోసం ప్రభుత్వం ఎంతో వ్యయంతో రేషన్ ఇస్తున్నప్పటికీ, కొంతమంది అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వ లక్ష్యం నీరు కారిపోతుందని చెప్పుకోవచ్చు. ఈ బస్తాలు చూసిన ప్రజలకు ప్రభుత్వంపై నమ్మకం పోవటమే కాకుండా పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పదుల సార్లు ప్రజల ముందే రేషన్ డీలర్ అధికారులకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చినప్పటికీ సమస్య పరిష్కరించకపొగా, స్పందించటమే మానేశారని ప్రజలు చెప్పుకొస్తున్నారు. ముక్క బియ్యం చూడగానే అటు ప్రభుత్వంపై ఇటు అధికారులపై ప్రజలు విరుచుకు పడుతున్నారు. ఇప్పటికైనా ఉన్నత అధికారులు చొరవ తీసుకొని ముక్కపట్టిన బియ్యాన్ని తీసుకెళ్లి, వాటి స్థానంలో మంచి బియ్యాన్ని ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు.
Also Read : కూర్త ఆలయంలో శివరాత్రి జాతరకు ఏర్పాట్లు పూర్తి… ఈనెల 19 వరకు మహజాతర
సివిల్ సప్లై అధికారి వివరణ..
ఈ సమస్య నా దృష్టికి రావటం జరిగింది. త్వరలో జిల్లా అధికారుల సూచనల మేరకు బియ్యం బస్తాలను రిటర్న్ తీసుకెళ్తామని, వాటి స్థానంలో మంచి బియ్యాని ఇస్తామని అన్నారు.
వట్టిపల్లి రేషన్ డీలర్ వివరణ…
స్టాక్ రాగానే బియ్యం బస్తాలు విప్పి చూసి బియ్యం బాలేవని ఉన్నత అధికారులకు సమాచారం ఇవ్వటం జరిగింది. ఇప్పటి వరకు బియ్యం బస్తాలు తీసుకెళ్లలేదని, అధికారులు చొరవ తీసుకొని బియ్యం బస్తాలను రిటర్న్ తీసుకొని మంచి బియ్యాన్ని పంపాలని కోరారు.
ఇవి కూడా చదవండి :
- ఆయనతో టచ్ లో ముగ్గురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు!
- ట్యూషన్ తో పాటు సెక్స్ పాఠాలు చెబుతున్న హెడ్ మాస్టర్
- కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బీఆర్‌ఎస్‌తో పొత్తు వ్యాఖ్యలు… సొంత పార్టీలోనే దుమారం
- వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి పోటీ… కోమటిరెడ్డి వ్యాఖ్యలపై బండి సంజయ్ కౌంటర్
- మహబూబ్ నగర్ టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ….
2 Comments