
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు దేవాలయ అభివృద్ధికి తెలంగాణ సీఎం కేసిఆర్ మరో రూ.500 కోట్లు ప్రకటించారు. ఇవాళ కొంటగట్టులో పర్యటించిన సీఎం కేసీఆర్.. స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. హైదరాబాద్ బేగంపేట నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో కొండగట్టుకు చేరుకున్న సీఎం.. ఏరియల్ వ్యూ ద్వారా ఆలయ పరిసరాలను పరశీలించారు. అనంతరం ఆలయంలో కలియతిరిగి అధికారులకు పలు సూచనలు చేశారు. కొండపై ఉన్న కోనేరు, కొత్త పుష్కరిణి, సీతమ్మ కన్నీటిధార, బేతాళస్వామి ఆలయం, కొండలరాయుడి గుట్ట తదితర స్థలాలను పరిశీలించారు. అనంతరం ఆలయ పునర్నిర్మాణం, అభివృద్ధిపై దేవాదాయశాఖ, జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. దేశంలోనే ప్రముఖ ఆంజనేయ క్షేత్రంగా కొండగట్టును తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు.
Read Also : పేద ప్రజలకు ముక్క బియ్యం…. డీలర్ వేడుకోలు, తిరిగి తీసుకెళ్లని అధికారులు
ఈ నేపథ్యంలో ఇప్పటికే మంజూరు చేసిన రూ. 100 కోట్లకు అదనంగా.. మరో రూ. 500 కోట్లు (మెుత్తం రూ. 600 కోట్లు) కేటాయించనున్నట్లు సీఎం వెల్లడించారు. ఆగమశాస్త్రం ప్రకారం ఆలయ పునర్నిర్మాణం చేపట్టాలని అధికారులకు సూచించారు. “ప్రపంచాన్నే ఆకర్షించేలా అద్భుత ఆధ్యాత్మిక క్షేత్రంగా కొండగట్టును తీర్చిదిద్దాలి. కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం అభివృద్ధి బృహత్తర ప్రాజెక్ట్. భక్తులకు సకల వసతులు, అన్ని హంగులతో ఆధ్యాత్మిక ఉట్టిపడేలా శ్రీ ఆంజనేయ స్వామి ఆలయాన్ని అభివృద్ధి చేయాలి. ఎలాంటి ప్రమాదాలకు ఆస్కారం లేకుండా ఘాట్ రోడ్డులను అభివృద్ధి చేయాలి. దేశంలోనే గొప్పగా హనుమాన్ జయంతి కొండగట్టులో జరగాలి. వేల మంది ఒకేసారి హనుమాన్ దీక్ష ధారణ, విరమణ చేసే సమయంలో ఏలాంటి ఇబ్బంది లేకుండా చూడాలి. హనుమాన్ దీక్ష దివ్యంగా, గొప్పగా జరిగేలా చూడాలి.
Also Read : ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి దూరంగా బీఆర్ఎస్ ?
సుమారు 850 ఎకరాలలో ఆలయ అభివృద్ధి, విస్తరణ పనులు చేయాలి. పెద్ద వాల్, పార్కింగ్, పుష్కరిణీ, అన్నదాన సత్రం, కళ్యాణ కట్ట, కోనేరు అభివృద్ధి చేయాలి. 86 ఎకరాలలో సువిశాల పార్కింగ్ ప్లేస్ ఏర్పాటు చేయాలి. వసతులు గొప్పగా ఉంటే దర్శనానికి వచ్చే భక్తులు పెరుగుతారు. మళ్ళీ వస్తా…. ఆలయ అభివృద్ధి, విస్తరణపై సమీక్ష నిర్వహిస్తా. ” అని సీఎం కేసీఆర్ అన్నారు. ఇక యాదాద్రి పున్మర్నిర్మాణంలో పాలుపంచుకున్న ప్రముఖ ఆర్కిటెక్ ఆనంద్ సాయి కి కొండగట్టు ఆలయ పునర్నిర్మాణ పనులను అప్పజెప్పారు. ఇప్పటికే కొండగట్టు ఆలయాన్ని ఆయన సందర్శించారు. ఆగమశాస్త్రం ప్రకారం.. మొదటి, రెండవ ప్రాకారాల నిర్మాణం జరిగేలా చూస్తామని అన్నారు. ఆలయ గోపురాలు, పుష్కరిణి, ఉద్యాన వనాలు, త్రాగునీరు, స్నానాల గదులు, పరిశుభ్రత, పార్కింగ్, రహదారులు పూర్తిస్థాయిలో ఏర్పాటు చేస్తామన్నారు.
ఇవి కూడా చదవండి :
- కూర్త ఆలయంలో శివరాత్రి జాతరకు ఏర్పాట్లు పూర్తి… ఈనెల 19 వరకు మహజాతర
- ఆయనతో టచ్ లో ముగ్గురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు!
- ట్యూషన్ తో పాటు సెక్స్ పాఠాలు చెబుతున్న హెడ్ మాస్టర్
- కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బీఆర్‌ఎస్‌తో పొత్తు వ్యాఖ్యలు… సొంత పార్టీలోనే దుమారం
- మహబూబ్ నగర్ టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ….