
క్రైమ్ మిర్రర్, కౌటాల : కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలంలోని తెలంగాణ రాష్ట్ర సరిహద్దులో వార్దా నదుల మధ్యలో తాటిపల్లి శివారులో గల శ్రీ శివ సిద్ది హనుమాన్ అలయం (కూర్త)లో ప్రతి ఏడాది శివ రాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఏడాది కూడా జాతర నిర్వహించేందుకు. ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లు పూర్తి చేసారు. ప్రతి యేటా మహశివ రాత్రి సందర్భంగా మహారాష్ట్ర , తెలంగాణ రాష్ట్రాల నుండి భక్తులు వేల సంఖ్యలో తరలివస్తారు. రాష్ట్రంలో ఎక్కడ లేని విధం గా ఆలయం వెనుక భాగాన 1 కిలో మీటర్ దూరం లో ఒకే గంగా రెండుగా విడిపోయి 100 ఎకరాల వ్యవసాయ భూములను ఉంచి ఆలయం ముందు ఒకే నది గా కలుస్తుంది . రెండు నదుల మధ్యలో ఉన్న ప్రదేశం ను కుర్తా పిలవడం జరుగుతుంది. ఈ ఆలయం రెండు నదుల మధ్యలో ఉండడం ఇక్కడి ప్రత్యేకత ఈ అనువైన ప్రదేశం జాతరకు వచ్చే భక్తులు పుణ్యస్నానం ఆచరించి గంగమ్మకు కౌబ్బరికాయ కొట్టి హనుమాన్ ఆలయంలో మొక్కులు తీర్చుకుంటారు.
Read Also : ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి దూరంగా బీఆర్ఎస్ ?
ఆలయ చరిత్ర :
మండలంలోని తాటీపల్లి శివారు లోని రెండు గంగల మధ్యలో శ్రీ శివ సిద్ది హనుమాన్ ఆలయం కలదు. ఈ ఆలయానికి దాదాపు 60 సంవత్సరాల చరిత్ర ఉంది. వార్దా నది ప్రవహిస్తున్నప్పుడు నదుల మధ్యలో హనుమాన్ విగ్రహం ప్రవాహంలో వచ్చి స్థిరంగా ఉన్నా ప్రదేశంను కూర్త గా భక్తులు చెప్తుంటారు. పూర్వికుల కథనం ప్రకారం తెలంగాణ మహారాష్ట్ర కి ఏండ్ల బండ్లలో పెళ్ళి కి వెల్లి వస్తుండంగా ఎడ్ల బండ్లు నది మధ్యలో రాగానే నది ప్రవాహం పెరిగింది . ఏండ్ల బండ్లలో ఉన్నా వారందరు అందరు ఒక్క సారిగా భయానికి గురై కూర్త లో ఉన్నా శ్రీ హనుమాన్ స్వామి ని ప్రహహం పెరుగుతుంది కాపాడమని కోరారు. కొద్దీ క్షణంలోనే ప్రవాహం స్థిరంగా ఉండి ఎడ్ల బండ్లు అన్ని ఒడ్డుకు చేరిన తరువాత గంగా ఒక్క సారిగా నీటితో నిండి పోయింది . కూర్త లో ఉన్నా శ్రీ హనుమాన్ స్వామి మహిమలను తలుచుకొని భక్తులు అప్పటి నుండి రెందు నదుల మధ్యలో కూర్త లో శివరాత్రి కి జాతర నిర్వహించడం జరుగుతుంది అని పూర్వికులు తెలిపారు. ప్రతి ఏటా శివరాత్రి మాసం లో హించే జాతర కావడం తో తెలంగాణ , మహారాష్ట్ర శివరాత్రికి ఉపవాసాలు పట్టే వారు తెలంగాణ, మహారాష్ట్ర నుండి వచ్చి గంగా స్నానం చేసి మొక్కు లు తీర్చుకుంటుంటారు.
Also Read :: ఆయనతో టచ్ లో ముగ్గురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు!
ఈ జాతరకు వేల సంఖ్యలో భక్తులు వస్తారు. ఈ ఆలయం దిన దినం అభివృద్ధి చెందుతుంది . భక్తులు ఇచ్చిన కానుకలతో దాతల, కమిటీ సభ్యుల సహకారం తో ఈ ఆలయం రోజు రోజు అభివృద్ధి చెందుతుంది. తాటి పల్లి నుండి కుర్తా కు పోవాలంటే గంగా ను దాటి పోవాల్సి ఉంటది దీనికి సరిఅయిన రోడ్డు లేక వాహనాలు ఆలయం వద్దకు పోవు వెళ్ళాలి అంటే గంగా లో ఉన్నా ఇసుక మెట్టలను దాటి పోవాల్సి ఉంటది ప్రతి సంవత్సరం ఆలయ నిధులతో తాత్కాలిక రోడ్డు నిర్మాణం చేప్పట్టే వారు ఈ సంవత్సరం ఆలయం లో నిధులు లేక రోడ్డు వెయ్యలేదు ప్రభుత్వం సహాయం అందించి రోడ్డు మంజూరు చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆలయ కమిటీ అధ్యక్షులు ఎల్ములే దత్తు కోరుతున్నారు.
ఇవి కూడా చదవండి :
- కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బీఆర్‌ఎస్‌తో పొత్తు వ్యాఖ్యలు… సొంత పార్టీలోనే దుమారం
- వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి పోటీ… కోమటిరెడ్డి వ్యాఖ్యలపై బండి సంజయ్ కౌంటర్
- ట్యూషన్ తో పాటు సెక్స్ పాఠాలు చెబుతున్న హెడ్ మాస్టర్
- నూతన సచివాలయ ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్…. అంబేద్కర్ జయంతి రోజున ప్రారంభం
- మహబూబ్ నగర్ టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ….
2 Comments