
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర కొనసాగుతోంది. ప్రస్తుతం పాలకుర్తి నియోజకవర్గంలో ఆమె పాదయాత్ర సాగుతోంది. ఈ సందర్భంగా షర్మిల పాదయాత్రలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. పాలకుర్తి నియోజకవర్గంలోని లక్ష్మీనారాయణ పురం స్టేజి వద్ద కల్లు గీత కార్మికుని కోరిక మేరకు షర్మిల నీరా రుచి చూశారు. కల్లు తాగడం తనకు అలవాటు లేదని, కానీ గీత కార్మికుడు కోరిక మేరకు కొద్దిగా రుచి చూసినట్లు షర్మిల తెలిపారు. గీత కార్మికుడితో కాసేపు మాట్లాడిన షర్మిల.. వారి సమస్యలను తెలుసుకున్నారు.
Read Also : గిరిజన ద్రోహి సీఎం కేసీఆర్…. ముఖ్యమంత్రిపై బండి సంజయ్ ఫైర్
వైఎస్సార్‌టీపీ అధికారంలో వచ్చిన వెంటనే కల్లు గీత కార్మికులకు పెద్దపీట వేస్తామని షర్మిల హామీ ఇచ్చారు. పాదయాత్రలో కల్లు గీత కార్మికులు ఎదుర్కొంటున్న కష్టాలను తాను విన్నానని, వారి కష్టాలను చూస్తే బాధ వేస్తుందని అన్నారు. అయితే ఇవాళ పాలకుర్తి నియోజకవర్గంతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్ర కూడా జరుగుతోంది. ఒకేరోజు నియోజకవర్గంలో ఇద్దరి నేతల పాదయాత్ర జరుగుతుండటంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పాదయాత్ర దృశ్యాలను చూసేందుకు డ్రోన్ కెమెరాలను ఏర్పాటు చేయడంతో పాటు భారీగా మోహరించారు. ఎలాంటి గొడవలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇవి కూడా చదవండి :
- కొండగట్టులో సీఎం కేసీఆర్ పర్యటన… ఆలయ అభివృద్ధికి మరో రూ. 500 కోట్లు
- పేద ప్రజలకు ముక్క బియ్యం…. డీలర్ వేడుకోలు, తిరిగి తీసుకెళ్లని అధికారులు.
- కూర్త ఆలయంలో శివరాత్రి జాతరకు ఏర్పాట్లు పూర్తి… ఈనెల 19 వరకు మహజాతర
- ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి దూరంగా బీఆర్ఎస్ ?
- ఆయనతో టచ్ లో ముగ్గురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు!
2 Comments