
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : పొత్తులపై మంగళవారం తాను మాట్లాడిన వ్యాఖ్యలను రాష్ట్ర వ్యవహారాల కాంగ్రెస్ ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రే లైట్ తీసుకున్నట్లు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. తమ సొంత పార్టీ వాళ్లు కూడా తన వీడియోను పూర్తిగా చూడలేదని, ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోకూడదని ఠాక్రేకు చెప్పానన్నారు. తాను మాట్లాడిన వ్యాఖ్యల్లో తప్పు లేదని, తన వ్యాఖ్యలపై ఠాక్రేతో జరిగిన సమావేశంలో చర్చ జరగలేదని వెంకటరెడ్డి చెప్పారు.
Read Also : ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి పెద్ద రౌడీ…. జీవిత రాజశేఖర్ సంచలన వ్యాఖ్యలు
‘తాను ఎక్కడా తప్పు మాట్లాడలేదనేది అధిష్టానం అభిప్రాయం. గతంలో టీడీపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల నష్టం జరిగింది. సరైన అభ్యర్థులను ఎంపిక చేయాలని చెప్పా. నెలాఖరులో మూడు నియోజకవర్గాల్లో నా పాదయాత్ర ఉంటుంది. గెలిచే అభ్యర్థులకు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వాలి. ఎన్నికలకు ఏ విధంగా సిద్దం కావాలన్నదానిపై చర్చించాం. టీడీపీతో పొత్తు వద్దన్నాను. నా వ్యాఖ్యలను తప్పుగా ప్రచారం చేశారు. ఓ సర్వే రిపోర్ట్ ద్వారా నేను నిన్న మాట్లాడా’ అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు.
Also Read : నీరా తాగిన వైఎస్ షర్మిల… కల్లు గీత కార్మికుల సమస్యలపై ఆరా
‘నేను ఈ నెలాఖరులో భువనగిరి నుంచి పాదయాత్ర మొదలుపెడతా. నల్లగొండలో ఉత్తమ్ కుమార్ రెడ్డి పాదయాత్ర మొదలుపెడతారు. సర్కార్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తాం. గతంలో ఆలస్యంగా టికెట్లు అనౌన్స్ చేశారు. అందుకే గొడవలు జరిగాయి. ఒంటరిగానే ఎన్నికలకు వెళ్లాలని ఠాక్రేకు చెప్పా. బీఆర్ఎస్‌తోనే కాదు.. ఏ పార్టీతోనూ పొత్తు ఉండదు’ అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు.
ఇవి కూడా చదవండి :
- గిరిజన ద్రోహి సీఎం కేసీఆర్…. ముఖ్యమంత్రిపై బండి సంజయ్ ఫైర్
- కొండగట్టులో సీఎం కేసీఆర్ పర్యటన… ఆలయ అభివృద్ధికి మరో రూ. 500 కోట్లు
- పేద ప్రజలకు ముక్క బియ్యం…. డీలర్ వేడుకోలు, తిరిగి తీసుకెళ్లని అధికారులు.
- కూర్త ఆలయంలో శివరాత్రి జాతరకు ఏర్పాట్లు పూర్తి… ఈనెల 19 వరకు మహజాతర
- ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి దూరంగా బీఆర్ఎస్ ?
2 Comments