
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : తెలంగాణలో గిరిజన రిజర్వేషన్ల అమలుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రిజర్వేషన్లు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన ఆయన.. కేంద్రం అడ్డుకుంటే తాను చూసుకుంటానని చెప్పారు. రిజర్వేషన్లపై సీఎం కేసీఆర్ ధ్వంద వైఖరి అవలంభిస్తున్నారని మండిపడ్డారు. పొరుగు రాష్ట్రం ఏపీలో గిరిజన కార్పొరేషన్ ఏర్పాటు చేసి గిరిజన గ్రామాలను అభివృద్ధి చేశారని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ గిరిజన ద్రోహి అని సంజయ్ విమర్శించారు. సీఎం కేసీఆర్ అంబేడ్కర్ జయంతి, వర్ధంతి కార్యక్రమాలకు హాజరు కావటం లేదన్నారు. లిపి లేని సమాజానికి దిశానిర్దేశం చేసిన సేవాలాల్ జయంతిని కూడా ప్రభుత్వం నిర్వహించటం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు.
Read Also : కొండగట్టులో సీఎం కేసీఆర్ పర్యటన… ఆలయ అభివృద్ధికి మరో రూ. 500 కోట్లు
గిరిజన బిడ్డలకు గతంలో ప్రకటించిన గిరిజన బంధు ఏమైందని ఆయన ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం గిరిజనుల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని.., అందులో భాగంగానే ద్రౌపది ముర్ముని రాష్ట్రపతిగా చేసి గిరిజన జాతి గౌరవాన్ని ప్రధాని మోదీ నిలబెట్టారని కొనియాడారు. కొండగట్టు బాధితులకు ఇప్పటి వరకు పరిహారం ఇవ్వని కేసీఆర్ ఇవాళ ఆలయ సందర్శనకు వెళ్లారని సంజయ్ ఫైర్ అయ్యారు. ప్రమాద బాధితులకు వెంటనే ఆర్థిక సహాయం ప్రకటించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్.. ఆలయాలకు నిధులు ప్రకటించటం వరకే పరిమితమవుతారని.. నిధులు మంజూరు కావని సంజయ్ ఎద్దేవా చేశారు.
ఇవి కూడా చదవండి :
- పేద ప్రజలకు ముక్క బియ్యం…. డీలర్ వేడుకోలు, తిరిగి తీసుకెళ్లని అధికారులు.
- కూర్త ఆలయంలో శివరాత్రి జాతరకు ఏర్పాట్లు పూర్తి… ఈనెల 19 వరకు మహజాతర
- ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి దూరంగా బీఆర్ఎస్ ?
- ఆయనతో టచ్ లో ముగ్గురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు!
- ట్యూషన్ తో పాటు సెక్స్ పాఠాలు చెబుతున్న హెడ్ మాస్టర్
2 Comments