
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు తూర్పు గోదావరి జిల్లా పర్యటనలో అపశృతి చోటుచేసుకుంది. జిల్లాలోని బురుగుపూడిలో చంద్రబాబు నాయుడు కారును.. మరో కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చంద్రబాబు ప్రయాణిస్తున్న కారు బంపర్ వంగిపోయింది. అయితే, ఎవరికీ ఎలాంటి గాయాలు లేకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. కాగా, చంద్రబాబునాయుడు బుధవారం నుంచి మూడు రోజుల పాటు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు.
Read Also : బీఆర్ఎస్‌తో పొత్తుపై వెంకటరెడ్డి యూటర్న్… పొత్తు ఉండదంటూ మళ్లీ వ్యాఖ్యలు
‘ఇదేం కర్మ మన రాష్ట్రానికి’ పేరుతో 3 రోజుల పాటు మూడు నియోజకవర్గాల్లో చంద్రబాబు రోడ్ షోలు, బహిరంగ సభలు నిర్వహించనున్నారు. నారా లోకేష్ పాదయాత్ర నేపథ్యంలో కొన్ని రోజుల పాటు గ్యాప్ తీసుకున్న చంద్రబాబు ఇక నుంచి రెగ్యులర్‌గా ప్రజల్లో ఉండేందుకు పక్కా రూట్ మ్యాప్‌ను సిద్ధం చేసుకున్నారు. ఈ నెల 15, 16, 17 తేదీల్లో కాకినాడ, తూర్పు గోదావరి జిల్లాల్లో పర్యటించనున్నారు. తొలి రోజు జగ్గంపేట.. రెండో రోజు జగ్గంపేట, పెద్దాపురం.. మూడో రోజు పెద్దాపురం, అనపర్తి నియోజకవర్గాల్లో చంద్రబాబు పర్యటన సాగనుంది.
Also Read : ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి పెద్ద రౌడీ…. జీవిత రాజశేఖర్ సంచలన వ్యాఖ్యలు
మూడు రోజుల పాటు 145 కిలో మీటర్ల పొడవున చంద్రబాబు రోడ్‌షో, పర్యటన సాగనుంది. జగ్గంపేటలో చంద్రబాబు పర్యటన ఏర్పాట్లను టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, టీడీపీ ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ పరిశీలించారు. గోకవరంలో ఏర్పాట్లను నెహ్రూ.. వంతల రాజేశ్వరి తదితరులు పరిశీలించారు. ఈ నేపథ్యంలో బుధవారం గోకవరంలో పర్యటించిన చంద్రబాబుకు స్థానికులు పూలు చల్లతూ స్వాగతం పలికారు.
ఇవి కూడా చదవండి :
- నీరా తాగిన వైఎస్ షర్మిల… కల్లు గీత కార్మికుల సమస్యలపై ఆరా
- గిరిజన ద్రోహి సీఎం కేసీఆర్…. ముఖ్యమంత్రిపై బండి సంజయ్ ఫైర్
- కొండగట్టులో సీఎం కేసీఆర్ పర్యటన… ఆలయ అభివృద్ధికి మరో రూ. 500 కోట్లు
- పేద ప్రజలకు ముక్క బియ్యం…. డీలర్ వేడుకోలు, తిరిగి తీసుకెళ్లని అధికారులు
- ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి దూరంగా బీఆర్ఎస్ ?