
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : వాలెంటైన్స్ డే.. ప్రేమికులు ప్రత్యేకంగా జరుపుకునే రోజు. అయితే ప్రతిసారి వాలెంటైన్స్ డే సందర్భంగా బజరంగ్ దళ్, విశ్వహిందూ పరిషత్తులు వాలెంటైన్స్ డే ని బహిష్కరిస్తూ, ప్రేమ జంటలు కనిపిస్తే పెళ్లి చేస్తామని హెచ్చరిస్తూ హల్చల్ చేసే విషయం తెలిసిందే. ఇక ఈ సంవత్సరం కూడా వాలెంటైన్స్ డే బహిష్కరణకు పిలుపునిచ్చిన పలు సంస్థలు ప్రేమ జంటలు కనిపిస్తే కౌన్సిలింగ్ ఇస్తామని తేల్చి చెబుతున్నాయి. ఇక పార్కులలోనూ, హోటళ్ళలోనూ జంటలు కనిపిస్తే రచ్చ చెయ్యటానికి రెడీ అయ్యాయి. ప్రేమికుల రోజు జరుపుకోవటం మన సంస్కృతి కాదని పదేపదే తేల్చి చెప్తున్న పలు సంస్థలు చాలా కాలంగా ప్రేమికులరోజు నాడు దొరికిన జంటలకు కౌన్సిలింగ్ ఇస్తూ, పెళ్లి చేసే ప్రయత్నం చేస్తున్నాయి.
Read Also : ఒకే నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి, వైఎస్ షర్మిల పాదయాత్రలు… మంత్రి ఇలాకాలో టెన్షన్
ఇక గతంలో పార్కులలోను, హోటల్స్, రెస్టారెంట్లలో, పబ్బులు, క్లబ్బులలోనూ ప్రేమ జంటలు ఎక్కడ కనిపించినా టార్గెట్ చేసిన సంస్థల తీరుతో, తాజాగా హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో హైదరాబాద్ నగర పోలీసులు అప్రమత్తమయ్యారు. నేడు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా ప్రేమికులు తిరిగే అన్ని ప్రాంతాలలోనూ గస్తీని ముమ్మరం చేశారు. ఎవరు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడానికి వీల్లేదని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉంటే నగరంలోని హోటళ్ళు, రెస్టారెంట్లు, పబ్ లు, క్లబ్ ల యజమానులు ప్రేమికుల రోజును వ్యతిరేకించేవారు తమ హోటళ్ళు, రెస్టారెంట్లపై దాడులు చేయకుండా అడ్డుకోవడం కోసం ప్రైవేట్ బౌన్సర్లను ఏర్పాటు చేసుకున్నారు.
Also Read : పుల్వామా దాడికి నాలుగేళ్లు… 40 మంది అమర జవాన్లకు దేశం ఘన నివాళి
హైదరాబాద్ నగరంలోని జోన్లలో ముఖ్యంగా పశ్చిమ మండలంలో ఎక్కువగా పబ్లు, రెస్టారెంట్లు, మాల్స్ ఉన్నాయి. దీంతో పోలీసు అధికారులు ఈ ప్రాంతంపై నిఘా పెట్టారు. అన్ని పార్కుల వద్ద, రెస్టారెంట్లు, మాల్స్ వద్ద భారీగా పోలీసులను కాపలాగా పెట్టారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇదిలా ఉంటే మరొకపక్క వాలెంటైన్స్ డే ను సరికొత్తగా జరుపుకోవాలని, స్పెషల్ డే గా సెలబ్రేట్ చేసుకోవాలని ప్రేమికులు తహతలాడుతున్నారు. వాలంటైన్స్ డే గిఫ్ట్ ల కోసం కొత్త కొత్త ఆలోచనలతో షాపింగ్ చేస్తున్నారు. ఏడాదంతా వాడిపోని గులాబీలతో ప్రేమను వ్యక్తం చెయ్యటానికి ప్రేమ పక్షులు రెడీ అవుతున్నారు. ఇంకోపక్క ఇదే అదునుగా హోటల్స్ లో స్పెషల్ మెనూలు కూడా వాలెంటైన్స్ డే స్పెషల్ గా అందుబాటులోకి వస్తున్నాయి.
Read Also : ఈటల కోసం కేసీఆర్ విశ్వప్రయత్నం… ట్విట్టర్ వేదికగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
కొన్ని హోటల్స్ వాలెంటైన్స్ డే రోజు ప్రత్యేకమైన కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నాయి. మూన్ లైట్ డిన్నర్ లను ఏర్పాటు చేస్తున్నాయి. క్యాండిల్ లైట్ డిన్నర్ లు, మ్యూజిక్, స్పెషల్ వంటకాలతో రెడీ అయ్యాయి. ఒకపక్క ప్రేమికుల రోజు సెలబ్రేట్ చేసుకోవాలని ప్రేమికులంతా రెడీ అవుతుంటే, అసలు మన సంస్కృతి కాని దానిని మనం పాటించటం తప్పని, అడ్డుకుని తీరుతామని బజరంగ్ దళ్ వంటి సంస్థలు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడ్డం కోసం పోలీసులు పహార కాస్తున్నారు. ఏది ఏమైనా పోలీసుల పహారా, పలు సంస్థల హెచ్చరికల నేపథ్యంలో ప్రేమికులు జరభద్రం..
ఇవి కూడా చదవండి :
- తెలంగాణ రాష్ట్ర అప్పుల వివరాలు వెల్లడి…. మెుత్తం అప్పులు 4,33,817.6 కోట్లు
- సీఎం కేసీఆర్‌కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సవాల్… కేంద్ర ఆర్ధిక పరిస్థితిపై చర్చకు రావాలంటు సవాల్
- తెలంగాణలో యూపి ఫార్ములా…. అధికారం కోసం బిజేపి ప్లాన్
- బీఆర్ఎస్‌లోకి మరో బలిజ నాయకురాలు!
One Comment