
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలకు ముందు పార్టీలు కలవకపోయినా ఫలితాల తర్వాత పొత్తులు ఉండయం ఖాయమన్నారు. తెలంగాణలో ఈ సారి ఏ పార్టీకి మెజార్టీ రాదన్నారు వెంకట్ రెడ్డి. ఎన్నికల్లో మాత్రం ఒంటరిగానే పోరాడుతామని.. ఎన్నికల తర్వాత మాత్రం పొత్తులు తప్పవని కోమటిరెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు.కేసీఆర్ అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్ పొగుడుతూ బిజెపి నీ తిట్టారని చెప్పారు. కాంగ్రెస్ ను పొగడాల్సిన అవసరం కేసీఆర్ కు లేదన్నారు. సీఎం కేసీఆర్ , కాంగ్రెస్ పార్టీలు కలవక తప్పదన్నారు.
Read Also : ఒకే నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి, వైఎస్ షర్మిల పాదయాత్రలు… మంత్రి ఇలాకాలో టెన్షన్
తెలంగాణ కాంగ్రెస్ ఇప్పుడిప్పుడే గాడిన పడుతోందన్నారు వెంకట్ రెడ్డి. వచ్చే ఎన్నికల్లో కొత్తైనా పాతైనా సరే కానీ గెలిచే వారికే టికెట్ ఇవ్వాలని సూచించారు. కొన్ని కారణాల వల్ల ఇంకా తమ నేతలు ఒక్క వేదిక పైకి రావడం లేదన్నారు కోమటిరెడ్డి. అందరూ కలిసి కష్ట పడితే 40 సీట్లు వస్తాయన్నారు. ఒక్కరు గెలిపిస్తా అంటే అయ్యే పని కాదన్నారు. రేవంత్ రెడ్డి టార్గెట్ గానే కోమటిరెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది. మార్చి 1వ తేదీ నుండి రాష్ట్రంలో పాదయాత్ర, బైక్ యాత్ర చేస్తానని కోమటిరెడ్డి ప్రకటించారు. రేవంత్ రెడ్డి పాదయాత్ర సాగుతుండగానే కాంగ్రెస్ పార్టీకి 40 సీట్లకు మించి రావని కోమటిరెడ్డి వ్యాఖ్యానించడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
ఇవి కూడా చదవండి :
- ప్రేమికులు జర భద్రం… వాలెంటైన్స్ డే బహిష్కరణకు పిలుపునిచ్చిన పలు సంస్థలు
- ఈటల కోసం కేసీఆర్ విశ్వప్రయత్నం… ట్విట్టర్ వేదికగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- పుల్వామా దాడికి నాలుగేళ్లు… 40 మంది అమర జవాన్లకు దేశం ఘన నివాళి
- తెలంగాణలో యూపి ఫార్ములా…. అధికారం కోసం బిజేపి ప్లాన్
- తెలంగాణ రాష్ట్ర అప్పుల వివరాలు వెల్లడి…. మెుత్తం అప్పులు 4,33,817.6 కోట్లు
One Comment