
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం కొనసాగుతున్న రేవంత్ రెడ్డి, వైయస్ షర్మిల పాదయాత్రలు అనేక ఉద్రిక్తతలకు కారణంగా మారాయి. ఒకరిని మించి ఒకరు మాటలు తూటాలు పేలుస్తూ ప్రభుత్వం పైన తీవ్ర విమర్శలు చేయడం తెలంగాణ రాజకీయాలలో ఆసక్తికర చర్చకు కారణంగా మారింది. రేవంత్ రెడ్డి, వైయస్ షర్మిల ఒక పక్కన తెలంగాణ సీఎం కేసీఆర్ ను, కెసిఆర్ కుటుంబ పాలనను టార్గెట్ చేస్తూనే మరోవైపు ఒకరిపై ఒకరు కూడా విమర్శలు చేసుకుంటూ ఉండడం ఆసక్తికరంగా మారింది. ఇక ఇదే సమయంలో తాజాగా ఈ ఇద్దరు ఫైర్ బ్రాండ్లు ఒకే నియోజకవర్గంలో ఒకే చోట పాదయాత్ర చేయనుండడం ఇప్పుడు పోలీసులకు పెద్ద పని పెట్టింది.
Read Also : పుల్వామా దాడికి నాలుగేళ్లు… 40 మంది అమర జవాన్లకు దేశం ఘన నివాళి
ఇప్పటికే వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైయస్ షర్మిల పాదయాత్ర పేరును రేవంత్ రెడ్డి బ్రష్టు పట్టిస్తున్నారని విమర్శించారు. రేవంత్ రెడ్డి చేస్తున్నది పాదయాత్రనో లేక దొంగ యాత్రనో అర్థం కావడం లేదని, ఆయన పాదయాత్ర పై సొంత పార్టీ నేతలే పెదవి విరుస్తున్నారు అంటూ ఆరోపణలు గుప్పించారు. రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ అని విమర్శించిన వైఎస్ షర్మిల ఆయన పిలక కెసిఆర్ చేతిలో ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. నిన్న జనగామలో నిర్వహించిన సభలో షర్మిల రేవంత్ రెడ్డిని టార్గెట్ చేశారు. ఇక ఈ క్రమంలో నేడు ఇరువురు నేతలు ఒకే చోట పాదయాత్ర చేయనుండడంతో అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. అటు కాంగ్రెస్ పార్టీ తెలంగాణా అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, వైఎస్సార్ తెలంగాణా పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాదయాత్రలతో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు.
Also Read : ఈటల కోసం కేసీఆర్ విశ్వప్రయత్నం… ట్విట్టర్ వేదికగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
మంత్రి ఎర్రబెల్లి ఇలాకా అయిన పాలకుర్తి నియోజకవర్గం లో ఈరోజు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల పాదయాత్రలో మరేం మాటల తూటాలు పేలుతాయో అని అంతా ఆసక్తిగా చూస్తున్నారు. నేడు వీరి పాదయాత్ర పాలకుర్తి నియోజకవర్గం లోకి ప్రవేశించడంతో ఇద్దరు ఒకే ప్రాంతంలో ఎదురుపడకుండా అవసరమైన చర్యలను పోలీసులు తీసుకుంటున్నారు. భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. రెండు పార్టీల కార్యకర్తలు ఎదురుపడకుండా చర్యలు తీసుకుంటున్న పోలీసులు పాలకుర్తి నియోజకవర్గం లో నేడు వీరి పాదయాత్రలు ప్రశాంతంగా జరగడానికి కావలసిన అన్ని చర్యలను చేపట్టారు.
Read Also : తెలంగాణ రాష్ట్ర అప్పుల వివరాలు వెల్లడి…. మెుత్తం అప్పులు 4,33,817.6 కోట్లు
ఇక మరోపక్క ఎర్రబెల్లి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం పాలకుర్తి కావటంతో అక్కడ బీఆర్ఎస్ నేతలు ఈ ఇరువురి పాదయాత్రల సరళిని నిశితంగా పరిశీలిస్తున్నారు. ఇప్పటికే మంత్రి ఎర్రబెల్లి రేవంత్ రెడ్డి పాదయాత్రపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇక వైఎస్ షర్మిలను కూడా అనేక సందర్భాలలో టార్గెట్ చేశారు. రేవంత్ రెడ్డి, వైఎస్ షర్మిల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును టార్గెట్ చేసి తీవ్ర విమర్శలు చేసే అవకాశం లేకపోలేదు. ఈ నేపధ్యంలో అలాంటి పరిస్థితి వస్తే బీఆర్ఎస్ నేతలు కూడా తీవ్రంగా ప్రతిఘటించే అవకాశం లేకపోలేదు. కాబట్టి పోలీసులకు మంత్రి ఇలాకాలో ఎలాంటి గొడవ లేకుండా పాదయాత్రలు కొనసాగేలా చెయ్యటం పెద్ద టాస్క్ అనే చెప్పాలి. మరి నేడు వీరి పాదయాత్రలతో స్థానికంగా ఏమి జరగబోతుందో తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి :
- సీఎం కేసీఆర్‌కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సవాల్… కేంద్ర ఆర్ధిక పరిస్థితిపై చర్చకు రావాలంటు సవాల్
- తెలంగాణలో కె -ల్యాబ్స్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించిన కైరోస్…
- తెలంగాణలో యూపి ఫార్ములా…. అధికారం కోసం బిజేపి ప్లాన్
- బీఆర్ఎస్‌లోకి మరో బలిజ నాయకురాలు!
- బీఆర్ఎస్ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు తనతో టచ్‌లో ఉన్నారు… కేఏ పాల్
3 Comments