
క్రైమ్ మిర్రర్, ప్రత్యేక ప్రతినిధి : హైదరాబాద్ హుస్సేన్ సాగర్ తీరాన తెలంగాణ కొత్త సచివాలయ నిర్మాణం పూర్తైంది. సీఎం కేసీఆర్ పుట్టినరోజైన ఫిబ్రవరి 17న ప్రారంభోత్సవానికి ముహుర్తం ఖరారు చేశారు. అయితే సడెన్ గా ఆ ప్రొగ్రామ్ వాయిదా పడింది. ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ రావడంతో కోడ్ అమలులోకి వచ్చినందున సచివాలయ ప్రారంభోత్సం వాయిదా పడిందని ప్రభుత్వం ప్రకటించింది. కాని తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం అది కారణం కాదని సమాచారం. సచివాలయ ప్రారంభోత్సం తేదిని ముందే ప్రకటించారు.. కాబట్టి ఎన్నికల కోడ్ పెద్ద ఇబ్బంది కాదని అంటున్నారు. ప్రభుత్వం నుంచి సీఈసీకి రిక్వెస్ట్ వెళితే సమస్య సాల్వ్ అయ్యేదని.. గతంలో ఇలాంటి ఘటనలు చాలా జరిగాయని చెబుతున్నారు.
Read Also : కేసీఆర్‌తో కాంగ్రెస్ కలవాల్సిందే.. రేవంత్ రెడ్డికి కోమటిరెడ్డి ఝలక్
ప్రస్తుతం ఏపీలోనూ ఎమ్మెల్యీ ఎన్నికల కోడ్ ఉంది. అయినా ఈనెల 15న కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి సీఎం జగన్ శంఖుస్తాపన చేయనున్నారు. ఏపీలో లేని సమస్య తెలంగాణలో ఎందుకు వచ్చిందన్నదే ఇప్పుడు చర్చగా మారింది. తెలంగాణలో కేవలం మూడు స్థానాలకే ఎన్నిక జరుగుతుంది.. కాని ఏపీలో 1౩ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.అయినా అక్కడ ముందే ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం కార్యక్రమం జరుగుతుండగా.. తెలంగాణ కొత్త సచివాలయం ప్రారంభోత్సం వాయిదా పడటంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేసీఆర్ ఆహ్వానించిన అతిథులు హ్యాండ్ ఇవ్వడం వల్లే సచివాలయ ప్రారంభోత్సవాన్ని వాయిదా వేశారనే చర్చ పొలిటికల్ సర్కిళ్లలో జరుగుతోంది.
Also Read : ప్రేమికులు జర భద్రం… వాలెంటైన్స్ డే బహిష్కరణకు పిలుపునిచ్చిన పలు సంస్థలు
తమిళనాడు సీఎం స్టాలిన్, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్, బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ ను సచివాలయ ప్రారంభోత్సవానికి సీఎం కేసీఆర్ ఆహ్వానించారు. అయితే రాజకీయపరమైన కారణాలతో స్టాలిన్, తేజస్వి యాదవ్ ఈ కార్యక్రమానికి రాలేమని తెలంగాణ ప్రభుత్వానికి సమాచారం పంపినట్లు తెలిసింది. తమిళనాడులో యూపీఏ కూటమితో కలిసి ఉన్నారు స్టాలిన్. కేసీఆర్ ఆహ్వానం మేరకు వెళ్తే తప్పుడు సంకేతాలు వెళ్తాయనే ఉద్దేశంతో స్టాలిన్ ఈ కార్యక్రమానికి హాజరు కావొద్దనే నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. బీహార్ లోనూ యూపీఏ కూటమి అధికారంలో ఉంది. దీంతో తేజస్వి యాదవ్ సైతం హైదరాబాద్ పర్యటనకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. జార్ఖండ్ ముక్తిమోర్చా పార్టీ సైతం కాంగ్రెస్ తో స్నేహ సంబంధాల్లోనే ఉన్నది. దీంతో హేమంత్ సోరెన్ సైతం హైదరాబాద్ రావడానికి ఇష్టపడలేదంటున్నారు. పిలిచిన అతిథులు రాకపోతే జనాల్లోకి రాంగ్ మెసేజ్ వెళ్తుందన్న కారణంతోనే సచివాలయ ప్రారంభోత్సవాన్ని వాయిదా వేశారనే చర్చ సాగుతోంది.
ఇవి కూడా చదవండి :
- ఒకే నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి, వైఎస్ షర్మిల పాదయాత్రలు… మంత్రి ఇలాకాలో టెన్షన్
- ఈటల కోసం కేసీఆర్ విశ్వప్రయత్నం… ట్విట్టర్ వేదికగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- పుల్వామా దాడికి నాలుగేళ్లు… 40 మంది అమర జవాన్లకు దేశం ఘన నివాళి
- తెలంగాణ రాష్ట్ర అప్పుల వివరాలు వెల్లడి…. మెుత్తం అప్పులు 4,33,817.6 కోట్లు
- తెలంగాణలో యూపి ఫార్ములా…. అధికారం కోసం బిజేపి ప్లాన్
One Comment