
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల నగరా మోగింది. హైదరాబాద్ స్థానిక సంస్థలతో పాటు హైదరాబాద్ – రంగారెడ్డి – మహబూబ్ నగర్ టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. త్వరలో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అన్ని పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి ప్రజల్లోకి పాజిటివ్ వేవ్ పంపించాలని పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి.
బలమైన అభ్యర్థులను పోటీలో నిలిపి సత్తా చాటాలని భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మహబూబ్ నగర్ టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి బీజేపీ అదిష్టానం అభ్యర్థిని ప్రకటించింది. బీజేపీ తరపున తమ అభ్యర్థిగా వెంకట నారాయణ రెడ్డి నిలుపుతున్నట్లు ప్రకటిచింది. ఏపీలోని కడప గ్రాడ్యుయేట్ బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా రాఘవేంద్ర, ప్రకాశం గ్రాడ్యుయేట్ అభ్యర్థిగా దయాకర్ రెడ్డి, శ్రీకాకుళం గ్రాడ్యుయేట్ అభ్యర్థిగా మాధవ్‌ను ప్రకటించారు. ఇక ఈనెల 16న ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్లకు చివరి తేదీ ఫిబ్రవరి 23 కాగా.. ఫిబ్రవరి 24న నామినేషన్లను పరిశీలిస్తారు.
Also Read : కేసీఆర్‌తో కాంగ్రెస్ కలవాల్సిందే.. రేవంత్ రెడ్డికి కోమటిరెడ్డి ఝలక్
ఫిబ్రవరి 27 వరకు నామినేషన్ల ఉపసంహరణకు ఈసీ గడువిచ్చింది. మార్చి 13న పోలింగ్ జరగనుండగా.. మార్చి 16న కౌంటింగ్ జరపనున్నట్లు ఎన్నికల సంఘం షెడ్యూల్‌లో పేర్కొంది. ఈసారి టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి ప్రైవేటు ఉపాధ్యాయులకు కూడా ఈసీ ఓటు వేసేందుకు అవకాశం కల్పించింది. దీంతో ఈ ఎన్నిక మరిత ఆసక్తిగా మారనుంది. అసెంబ్లీ ఎన్నికల విధుల్లో ఉపాధ్యాయులే కీలకం కావటంతో అన్ని పార్టీలూ వారిని మచ్చిక చేసుకునే పనిలో తలమునకలయ్యాయి. కాగా.. అధికార పార్టీ బీఆర్ఎస్ మద్దతు ఎవరికి ఉండబోతుందనేది ఆసక్తిగా మారింది.
ఇవి కూడా చదవండి :
- ప్రేమికులు జర భద్రం… వాలెంటైన్స్ డే బహిష్కరణకు పిలుపునిచ్చిన పలు సంస్థలు
- ఒకే నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి, వైఎస్ షర్మిల పాదయాత్రలు… మంత్రి ఇలాకాలో టెన్షన్
- ఈటల కోసం కేసీఆర్ విశ్వప్రయత్నం… ట్విట్టర్ వేదికగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- పుల్వామా దాడికి నాలుగేళ్లు… 40 మంది అమర జవాన్లకు దేశం ఘన నివాళి
- తెలంగాణలో యూపి ఫార్ములా…. అధికారం కోసం బిజేపి ప్లాన్
2 Comments