
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : భువనగిరి ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన ‘పొత్తు’ వ్యాఖ్యలు తెలంగాణ పాలిటిక్స్‌లో హాట్ టాఫిక్‌గా మారాయి. రానున్న ఎన్నికల్లో కేసీఆర్ కాంగ్రెస్‌తో కలకవ తప్పదని ఆయన వ్యాఖ్యనించటంపై ఇటూ సొంత పార్టీతో పాటు ప్రతిపక్ష పార్టీల నుంచి పెద్ద కౌంటర్ కామెంట్స్ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కోమటిరెడ్డి చేసిన కామెంట్లపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. తెలంగాణ కాంగ్రెస్ బీఆర్ఎస్‌తో కలిసి పోటీ చేయాలని చూస్తోందన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఎన్నికల వరకు తన్నుకుని.. చివర్లో మాత్రం కలిసి పోటీ చేస్తాయని ఆయన జోశ్యం చెప్పారు.
Read Also : నూతన సచివాలయ ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్…. అంబేద్కర్ జయంతి రోజున ప్రారంభం
మరి కొన్ని నెలల్లో జరగనున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ , కాంగ్రెస్, కమ్యూనిస్టులు కలిసి పోటీ చేయటం ఖాయమన్నారు. బీజేపీ భయంతోనే తెలంగాణలోని అన్ని పార్టీలు ఒక్కటవుతున్నాయని చెప్పారు. అటు దేశంలోనూ, ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ ఉనికి ఎక్కడ లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలు ఎన్ని పాదయాత్రలు చేసినా ఉపయోగం లేదని సంజయ్ వ్యాఖ్యనించారు. తెలంగాణలో బీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయంగా బీజేపీ బలపడుతోందని.. అందుకే సీఎం కేసీఆర్ బీజేపీ టార్గెట్ చేశారని బండి సంజయ్ మండిపడ్డారు. ఎవరెన్ని ఎత్తుగడలు వేసినా వచ్చే రానున్న ఎన్నికల్లో తెలంగాణలో కాషాయ జెండా రెపరెపలాడటం తథ్యమన్నారు.
Also Read : మహబూబ్ నగర్ టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ….
119 స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థులు విజయం సాధిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. దిల్లీలో ఇవాళ మీడియాతో మాట్లాడిన కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకీ పూర్తి స్థాయి వచ్చే పరిస్థితి లేదని అన్నారు. ఏ పార్టీకీ 60కి మించి సీట్లు రావని అన్నారు. హంగ్ ఖాయమని.., ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌తో సీఎం కేసీఆర్ కలవక తప్పదని జోశ్యం చెప్పారు. కాంగ్రెస్‌లో ఉన్న నేతలందరూ కష్టపడితే.. 40 నుంచి 50 అసెంబ్లీ స్థానాలు కచ్ఛితంగా వస్తాయని చెప్పారు. అధికారంలో కాంగ్రెస్ ఉండటం ఖాయమని అన్నారు.
ఇవి కూడా చదవండి :
- కేసీఆర్ కు వాళ్లంతా హ్యాండిచ్చారా?…సెక్రటేరియట్ ఓపెనింగ్ వాయిదా అందుకేనా ?
- కేసీఆర్‌తో కాంగ్రెస్ కలవాల్సిందే.. రేవంత్ రెడ్డికి కోమటిరెడ్డి ఝలక్
- ప్రేమికులు జర భద్రం… వాలెంటైన్స్ డే బహిష్కరణకు పిలుపునిచ్చిన పలు సంస్థలు
- ఒకే నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి, వైఎస్ షర్మిల పాదయాత్రలు… మంత్రి ఇలాకాలో టెన్షన్
- ఈటల కోసం కేసీఆర్ విశ్వప్రయత్నం… ట్విట్టర్ వేదికగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
One Comment