
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలో అధికారం చేపట్టడం కోసం బిజెపి శతవిధాల ప్రయత్నం చేస్తోంది. బిజెపి అధినాయకత్వం తెలంగాణ రాష్ట్రంపై ప్రత్యేకమైన దృష్టిని పెట్టి క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడానికి రకరకాల ప్రయోగాలు చేస్తుంది. తెలంగాణ రాష్ట్రంలోనూ యూపీ ఫార్ములాను అమలుచేసి అధికారం కోసం కసరత్తులు చేస్తుంది. ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ ఏ విధంగా అయితే అధికారాన్ని నిలబెట్టుకున్నారో అదే ఫార్ములాను తెలంగాణ రాష్ట్రంలో కూడా అధికారం చేపట్టడం కోసం బిజెపి అమలు చేయాలని నానా తండాలు పడుతుంది. ఇందులో భాగంగానే ప్రస్తుతం స్ట్రీట్ కార్నర్ మీటింగ్లను నిర్వహిస్తుంది.
Read Also : బీఆర్ఎస్ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు తనతో టచ్‌లో ఉన్నారు… కేఏ పాల్
ఆ తర్వాత నియోజకవర్గం, జిల్లాస్థాయి సమావేశాలను నిర్వహించి.. ఆపై భారీ బహిరంగ సభలను నిర్వహించాలని బిజెపి భావిస్తుంది. క్షేత్రస్థాయి నుండి పార్టీని బలోపేతం చేయడానికి నిర్ణయం తీసుకున్న బిజెపి ఈ క్రమంలోనే ప్రస్తుతం ప్రజా గోస బిజెపి భరోసా యాత్ర పేరుతో ప్రజాక్షేత్రంలోకి వెళుతుంది. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం కోసం ఏం చేసింది అనేది చెబుతూ, తెలంగాణ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజాక్షేత్రంలో తూర్పారబడుతుంది బిజెపి. ప్రజా గోస బిజెపి భరోసా కార్యక్రమం లో భాగంగా 11వేల స్ట్రీట్ కార్నర్ మీటింగ్లను నిర్వహించాలని ప్లాన్ చేసుకున్న బీజేపీ ప్రస్తుతం ఆ పనిలో బిజీగా ఉంది. ముఖ్యంగా ఈ మీటింగ్లలో కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి, ప్రధాని నరేంద్ర మోడీ దేశ పాలనలో సాధించిన విజయాలను గురించి, కెసిఆర్ వైఫల్యాలను గురించి ప్రజలకు తెలియచెప్పే ప్రయత్నం చేస్తున్నారు బిజెపి నాయకులు.
Also Read : దక్షిణ టర్కీ నగరంలో 4.7 తీవ్రతతో మరోసారి భూకంపం… 34 వేలు దాటిన మృతులు
అయితే ఈ స్ట్రీట్ కార్నర్ మీటింగులు బిజెపిని బలోపేతం చేయడానికి ఉపయోగపడతాయని పార్టీ నాయకులు భావిస్తున్నారు. ముఖ్యంగా గ్రామాలపై ఫోకస్ చేస్తున్న బిజెపి గ్రామీణ యువత పెద్ద ఎత్తున ఈ వీధి సభలలో పాల్గొనేలా ప్లాన్ చేస్తుంది. ఇక స్ట్రీట్ కార్నర్ మీటింగ్ ల తర్వాత అగ్రనేతలతో రెండవ దశలో మండలం యూనిట్ గా ప్రజా గోస బిజెపి భరోసా పేరుతో 15 రోజులపాటు బైక్ ర్యాలీలు నిర్వహించాలని భావిస్తున్నారు. ఆ తర్వాత అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో బహిరంగ సభలు, జిల్లా స్థాయిలో బహిరంగ సభలు నిర్వహించి, అగ్ర నేతలతో భారీ బహిరంగ సభలను నిర్వహించాలని బిజెపి షెడ్యూల్ చేసుకుంది. అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ వచ్చేలోపు ప్రజాక్షేత్రంలోకి బలంగా వెళ్లాలని భావిస్తున్న బిజెపి ఈ మేరకు నిర్ణయాన్ని తీసుకుంది. ఇక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యేలోపు ప్రధాని నరేంద్ర మోడీని కూడా తెలంగాణ రాష్ట్రంలోని భారీ బహిరంగ సభలలో పాల్గొనేలా బిజెపి ప్లాన్ చేస్తుంది. నాలుగైదు సభల్లో మోడీని భాగస్వామ్యం చేస్తే మోడీ చరిష్మా తెలంగాణాలో వర్కవుట్ అవుతుందని భావిస్తున్నారని తెలుస్తుంది.
Read Also : గాంధీ ఆస్పత్రిలో కాలం చెల్లిన మందుల కలకలం… మందులు తీసుకున్న పేషంట్లలో కలవరం
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఏ విధంగా అయితే ఎన్నికల ఫార్మాట్ ను బిజెపి అమలు చేసిందో అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలోనూ ఒక పక్కా ప్రణాళికతో, యూపీ ఫార్ములాతో బిజెపి ముందుకు వెళుతుంది. బిజెపి అగ్రనాయకత్వం దిశా నిర్దేశం మేరకు సభలు నిర్వహిస్తున్న నాయకులు నామమాత్రంగా కాకుండా, ప్రజల్లోకి బలంగా వెళ్లేలా వీటిని నిర్వహిస్తే మంచి ఫలితం ఉంటుందని భావిస్తున్నారు. అయితే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో రెండోసారి బిజెపి అధికారంలోకి రావడానికి యోగి టీం ఉపయోగించిన ఫార్ములా తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారి బిజెపి అధికారంలోకి రావడానికి ఏ మాత్రం ఉపయోగపడుతుంది? ఇది ఏ విధమైన ఫలితాలను ఇస్తుంది? అనేది మాత్రం ముందు ముందు తెలియనుంది.
ఇవి కూడా చదవండి :
- 14 ఏళ్లు దుబాయ్ జైలులో శిక్ష.. చివరకు మరణం నుంచి తప్పించుకుని
- పచ్చని తెలంగాణాను పిచ్చోళ్ళ చేతుల్లో పెట్టొదు…మంత్రి కేటిఆర్
- మరో శ్రీలంకలా మారిన పాకిస్తాన్.. ప్రజలపై కొత్త పన్నులు వేయడానికి రెడీ
- ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఏపీ నుంచి తొలి అరెస్టు.. మాగుంట రాఘవరెడ్డి అరెస్టు
- సీఎం కేసీఆర్ కీలక ప్రకటన…. పోడు భూములకు రైతుబంధు, భూమి లేని వారికి గిరిజనబంధు
4 Comments