
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత రాష్ట్ర అప్పులు గణనీయంగా పెరిగాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం చేస్తు్న్న అప్పులు ప్రతి ఏడాది పెరుగుతూనే ఉన్నాయన్నారు. 2022 అక్టోబర్ నాటికి మెుత్తం తెలంగాణ రాష్ట్ర అప్పు రూ. 4,33,817.6 కోట్లుగా ఆయన వెల్లడించారు. 2014లో తెలంగాణ ఆవిర్భావం నాటికి రాష్ట్ర అప్పు 75 వేల 577 కోట్ల ఉండగా.. 2021-22 ఆర్థిక సంవత్సరానికి ఆ మెుత్తం అప్పు 2 లక్షల 83 వేల కోట్లకు చేరిందని స్పష్టం చేశారు. ప్రభుత్వరంగ సంస్థలు, కార్పొరేషన్లు మరో లక్షా 50 వేల కోట్లు అప్పు తీసుకున్నట్లు కేంద్రమంత్రి వెల్లడించారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం చేసిన అప్పులు ఆర్థిక సంవత్సరం వారీగా ఇలా ఉన్నాయి.
Read Also : బీఆర్ఎస్‌లోకి మరో బలిజ నాయకురాలు!
- 2014-15లో రూ. 8,121 కోట్లు
- 2015-16లో రూ. 15,515 కోట్లు
- 2016-17లో రూ. 30,319 కోట్లు
- 2017-18లో రూ. 22,658 కోట్లు
- 2018-19లో రూ. 23,091 కోట్లు
- 2019-20లో రూ. 30,577 కోట్లు
- 2020-21లో రూ. 38,161 కోట్లు
- 2021-22లో రూ. 39,433 కోట్లు
Also Read : సీఎం కేసీఆర్‌కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సవాల్… కేంద్ర ఆర్ధిక పరిస్థితిపై చర్చకు రావాలంటు సవాల్
ఈ అప్పులే కాకుండా తెలంగాణ ప్రభుత్వరంగ సంస్థలు, కార్పొరేషన్లకు రుణాలు ఇచ్చినట్లు కేంద్ర ఆర్ధిక శాఖకు ప్రభుత్వ రంగ బ్యాంకులు నివేదించాయని మంత్రి తెలిపారు. నాబార్డు, ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఇతర కార్పొరేషన్ల నుంచి తెలంగాణ ప్రభుత్వ కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థలు తీసుకున్న అప్పు రూ. 1,50,365.60 కోట్లకు చేరినట్లు వివరించారు. 12 బ్యాంకుల నుంచి ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు తీసుకున్న రుణాలు.. రూ.1,30,365.60 కోట్లకు చేరినట్లు చెప్పారు. వేర్ హౌస్ ఇన్ఫ్రాస్టక్చర్ ఫండ్ నుంచి రూ. 972 కోట్లు మంజూరు కాగా.. రూ. 852 కోట్లు విడుదల చేశామనన్నారు. రూరల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ నుంచి రూ. 8,871 కోట్లు మంజూరు కాగా… రూ. 7,144 కోట్లు విడుదల చేసినట్లు కేంద్రం వివరాలు వెల్లడించింది. ఫుడ్ ప్రాసెసింగ్ ఫండ్ నుంచి 2015-16, 2016-17లో రూ. 28 కోట్లు మంజూరు చేయగా.. రూ. 10 కోట్లు విడుదల అయినట్లు తెలిపింది. నాబార్డ్ ఇన్‌ఫ్రాస్ట్రక్ఛర్ డెవలప్‌మెంట్ అసిస్టెన్స్ నుంచి వివిధ పథకాల అమలు కోసం రూ. 14,516.65 కోట్లు మంజూరు కాగా.. తెలంగాణ ప్రభుత్వం రూ. 11,424.66 కోట్లు వాడుకున్నట్లు కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి వివరాలు వెల్లడించారు.
ఇవి కూడా చదవండి :
- తెలంగాణలో కె -ల్యాబ్స్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించిన కైరోస్…
- గుంటూరు జిల్లాలో దారుణం…. గంజాయి మత్తులో యువతిని నరికి చంపిన దుండగుడు
- స్విమ్మింగ్‌లో సత్తా చాటిన హీరో మాధవన్ కొడుకు… ఏడు పతకాలు సాధించిన వేదాంత్
- తెలంగాణలో యూపి ఫార్ములా…. అధికారం కోసం బిజేపి ప్లాన్
- బీఆర్ఎస్ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు తనతో టచ్‌లో ఉన్నారు… కేఏ పాల్
3 Comments