
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో బీఆర్ఎస్ నియంత పాలన కొనసాగిస్తున్నాయని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో ఈ రెండు పార్టీలను చిత్తు చిత్తుగా ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలను పక్కన పెట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పాలన సాగిస్తున్నాయని మండిపడ్డారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. అధికార బీఆర్ఎస్ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు తనతో టచ్‌లో ఉన్నారని బాంబ్ పేల్చారు. ప్రస్తుతం యుద్దం జరుగుతోంది. న్యాయం కోసమే ఆ యుద్ధం జరుగుతోంది. బడుగు బలహీన వర్గాలు మిమ్మల్ని చిత్తు చిత్తుగా ఓడిస్తారు. కలిసి పోరాడుదామని ప్రజలకు పిలుపినిస్తున్నా. ఇప్పటికే ముగ్గురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నాతో టచ్‌లో ఉన్నారు.
Read Also : దక్షిణ టర్కీ నగరంలో 4.7 తీవ్రతతో మరోసారి భూకంపం… 34 వేలు దాటిన మృతులు
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు తనని ఎందుకు కలిశారో అంబేడ్కర్ జయంతి (ఏప్రిల్ 14) రోజున తెలుస్తుంది. తాము ఎమ్మెల్యేలను కొనుగోలు చేయబోమం. తెలంగాణలోని 119 మంది ఎమ్మెల్యేల్లో 15 నుంచి 20 గెలుపు గుర్రాలు ఉన్నాయి. ప్రజాసేవ చేసేందుకు వారు ఏ పార్టీలోనైనా చేరవచ్చు. ముగ్గురు ఎమ్మెల్యేలు నాతో టచ్‌లో ఉన్నారు. కేసిఆర్ గారు ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు. నేను ఢిల్లీ రాక ముందు ఎవరెవరితో మాట్లాడానో కేసీఆర్‌కు తెలుసు. కేసీఆర్‌కు ప్రజలే బుద్ధి చెబుతారు. దేశాన్ని అమ్మేసింది బీజేపీ. దేశాన్ని సర్వనాశనం చేసింది బీజేపీ. మోదీ పాలసీలు ప్రజా వ్యతిరేకం. కాంగ్రెస్ 56 సంవత్సరాలలో చేయని అప్పు ఎనిమిదేళ్లలో మోదీ చేశారు. మోదీ అదానీ కలిసి దేశం పరువు తీస్తున్నారు అని కేఏ పాల్ మండిపడ్డారు. అంబేడ్కర్ జయంతి రోజున నూతన సచివాలయాన్ని ప్రారంభించాలని సీఎం కేసీఆర్‌ను డిమాండ్ చేసినట్లు చెప్పారు. ఆయన మాత్రం తన పుట్టినరోజున ఓపెన్ చేసేందుకు సిద్ధమయ్యారని.. ఈ విషయంపై తాను కోర్టులో కేసు వేసినట్లు చెప్పారు.
Also Read : గాంధీ ఆస్పత్రిలో కాలం చెల్లిన మందుల కలకలం… మందులు తీసుకున్న పేషంట్లలో కలవరం
ప్రభుత్వం దిగివచ్చి సచివాలయం ప్రారంభాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిదన్నారు. ఎలక్షన్ కోడ్ నెపంతో సచివాలయం ప్రారంభోత్సవాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం కవరింగ్ చేసుకునే ప్రయత్నం చేస్తోందని.., ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌కు సచివాలయ ప్రారంభోత్సవానికి అసలు సంబంధమేంటని ఆయన ప్రశ్నించారు. తాము న్యాయ పోరాటం చేయటం వల్లే సెక్రటేరియట్ ప్రారంభోత్సవం వాయిదా పడిందని చెప్పుకొచ్చారు. ఇటీవల సచివాలయంలో జరిగిన అగ్నిప్రమాదంపై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐతో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. కేసీఆర్ బీజేపీకి బీ పార్టీ ఇద్దరూ కలసి దేశ ప్రజలను దోచుకుంటున్నారని కేఏ పాల్ విమర్శించారు.
ఇవి కూడా చదవండి :
- 14 ఏళ్లు దుబాయ్ జైలులో శిక్ష.. చివరకు మరణం నుంచి తప్పించుకుని
- ప్రారంభమైన ఫార్ములా ఈ – రేస్…. తరలివచ్చిన సెలబ్రిటీలు, క్రికెటర్లు
- ప్రభుత్వ తీరుకు నిరసనగా బుల్లెట్ బైక్ నడుపుతూ అసెంబ్లీకి రాజాసింగ్…
- పచ్చని తెలంగాణాను పిచ్చోళ్ళ చేతుల్లో పెట్టొదు…మంత్రి కేటిఆర్
- రూ.1000 కోట్లు పంచినా రాజాసింగ్‌కు ఓటేయరు.. గోషామహల్‌లో ఫ్లెక్సీల కలకలం
3 Comments