
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : సీఎం కేసీఆర్ కొండగట్టు పర్యటన వాయిదా పడింది. జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధి పనులు పరిశీలించేందుకు.. సీఎం కేసీఆర్ రేపు(ఫిబ్రవరి 14న) వెళ్లాలని ముందుగా నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే.. రేపు స్వామివారికి శ్రేష్ఠమైన రోజు మంగళవారం కావటం వల్ల ఆలయానికి భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. దీంతో.. సీఎం కేసీఆర్ పర్యటన.. భక్తులకు ఇబ్బందిగా మారే అవకాశం ఉంది. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతోనే… ముందుగా అనుకున్న ఫిబ్రవరి 14న కాకుండా.. ఆ తర్వాతి రోజైన 15న సీఎం కేసీఆర్ కొండగట్టులో పర్యటించనున్నట్లు అధికారులు వెల్లడించారు.
Read Also : తెలంగాణ రాష్ట్ర అప్పుల వివరాలు వెల్లడి…. మెుత్తం అప్పులు 4,33,817.6 కోట్లు
కాగా.. ఇప్పటికే.. కొండగట్టులో ప్రముఖ ఆర్కిటెక్ట్ ఆనంద్ సాయి పర్యటించారు. ఆలయాన్ని పూర్తిగా పరిశీలించి.. అభివృద్ధి పనులకు సంబంధించిన మాస్టర్ ప్లాన్, నివేదికను సీఎం కేసీఆర్‌కు సమర్పించారు. అయితే.. రాష్ట్రంలో ఉన్న ప్రముఖ దేవాలయాలను అభివృద్ధి చేసే పనిలో భాగంగా.. సీఎం కేసీఆర్ ఇప్పటికే యాదాద్రిని పునఃనిర్మాణం చేసి.. తెలంగాణ తిరుపతిగా మార్చిన సంగతి తెలిసింది. ఇక.. మిగతా ఆలయాలైన వేములవాడ, కొండగట్టుపై దృష్టి సారించారు. ఈ నేపథ్యంలోనే కొండగట్టు అభివృద్ధి కోసం ఇటీవలే 100 కోట్లు కూడా ప్రకటించారు. కొండగట్టును తెలంగాణలో రెండో అతిపెద్ద పవిత్ర క్షేత్రంగా తీర్చిదిద్దేందుకు సీఎం కేసీఆర్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. గతంలో కేసీఆర్ చెప్పినట్టుగానే.. నిధులు విడుదల చేసిన తర్వాతే కొండగట్టుకు వస్తానన్న మాట నిజం చేస్తుండటం గమనార్హం.
Also Read : బీఆర్ఎస్‌లోకి మరో బలిజ నాయకురాలు!
కాగా.. సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పర్యటనలో భాగంగా ముందుగా కేసీఆర్.. స్వామివారిని దర్శించుకుంటారు. అనంతరం.. ఆలయాన్ని పూర్తిగా కలియ తిరిగి పరిశీలిస్తారు. ఆలయ అభివృద్ధి పనులకు సంబంధించి.. కేసీఆర్ అధికారులతో చర్చిస్తారు. కాగా.. కేసీఆర్ పర్యటన కోసం జిల్లా ఎస్పీ భాస్కర్ ఏర్పాట్లను పరిశీలించారు. కొండగట్టుకు సమీపంలో ఉన్న జేఎన్టీయూ క్యాంపస్‌లో ఉన్న హెలిప్యాడ్‌ను ఎస్పీ పరిశీలించారు.
ఇవి కూడా చదవండి :
- సీఎం కేసీఆర్‌కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సవాల్… కేంద్ర ఆర్ధిక పరిస్థితిపై చర్చకు రావాలంటు సవాల్
- తెలంగాణలో కె -ల్యాబ్స్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించిన కైరోస్…
- స్విమ్మింగ్‌లో సత్తా చాటిన హీరో మాధవన్ కొడుకు… ఏడు పతకాలు సాధించిన వేదాంత్
- తెలంగాణలో యూపి ఫార్ములా…. అధికారం కోసం బిజేపి ప్లాన్
- బీఆర్ఎస్ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు తనతో టచ్‌లో ఉన్నారు… కేఏ పాల్